Private School Locks up 34 Students Over Fees Dues ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల నిర్బంధం… స్కూల్‌పై కేసు నమోదు

Odisha private school locks up 34 students for 5 hours over non payment of dues

Apeejay School, fee payment, locked up, School students, library, confined, five hours, notices, defaulting parents, parents protests, Bhubaneswar, Odisha

Apeejay School in Bhubaneswar came under the scanner after it allegedly locked up 34 students in the library for non-payment of fees. The incident took place when the teachers asked 34 students from different classes, whose fees were not cleared, to come to the library. They confined the students there for five hours ( between 9.30am and 2.30pm) after the exam, said reports.

ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల నిర్బంధం… స్కూల్‌పై కేసు నమోదు

Posted: 08/25/2022 12:09 PM IST
Odisha private school locks up 34 students for 5 hours over non payment of dues

విద్యను వ్యాపారంగా మార్చిన కొన్ని పాఠశాల యాజమాన్యాలు కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నా.. చట్టాలు, ప్రభుత్వాలు వారికి కొమ్ముకాస్తున్నాయే కానీ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక పాఠశాల ఏర్పాట్లు కూడా విశాలమైన ప్రాంగణాల్లో కాకుండా ఇరుకైన గదులతో కూడిన బహుళ అంతస్థులలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు గుడ్లు అప్పగించి చూస్తున్నారే తప్ప.. వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమకు ఎదురు లేదని వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం మరింత బరితెగింది దారుణమైన చర్యలకు పాల్పడింది.

విద్యార్థుల తల్లిదండ్రులు సకాలంలో ఫీజులు చెల్లించలేదని వారి పిల్లలను పాఠశాలలోని ఓ హాల్ లో నిర్భంధించింది. ఏకంగా నాలుగైదు గంటల పాటు ఇలా చేసిన తరువాత వారికి నోటీసులను అందించింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ స్కూల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌పై కేసు నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. భువనేశ్వర్‌ నగరంలోని అపీజే స్కూల్‌లో సోమవారం పరీక్ష తర్వాత ఫీజులు చెల్లించని 34 మంది విద్యార్థులను లైబ్రరీలో ఐదు గంటలపాటు బంధించారు. 3వ తరగతి చిన్నారుల నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు ఇందులో ఉన్నారు. అనంతరం వారికి ఫీజు నోటీసులు ఇచ్చి ఇళ్లకు పంపారు.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులను చెల్లించేది విద్యార్థులా.? లేక వారి తల్లిదండ్రులా అన్న విషయం కూడా మర్చిపోయి అభంశుభం ఎరుగని విద్యార్థులను నిర్భందించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్కూల్‌ ఫీజుల అంశాన్ని తమతో చెప్పాల్సిందని అది కాకుండా తమ పిల్లలను గదిలో నిర్భందించే హక్కు పాఠశాల యాజమాన్యానికి ఎవరు ఇచ్చారని వారు ధ్వజమెత్తారు. కొందరు పేరెంట్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పాఠశాల యాజమాన్య నిర్వాకంపై ఫిర్యాదు చేశారు.

దీంతో అపీజే స్కూల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), వైస్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌పై ఐపీసీతోపాటు జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, ఆ స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతోపాటు లైబ్రేరియన్‌, ఇతర టీచర్ల స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తామని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రతీక్ సింగ్ తెలిపారు. స్కూల్‌ వైస్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు ఒడిశా చైల్డ్ రైట్స్ కమిషన్‌ కూడా ఈ సంఘటనను ఖండించింది. దీనిపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles