Retired AP teacher loses Rs 21 lakh in WhatsApp fraud వాట్సాప్ ఫ్రాడ్: మ‌హిళ ఖాతా నుంచి రూ. 21 ల‌క్ష‌లు మాయం!

Whatsapp alert ap woman duped of rs 21 lakhs through message link

whatsapp, whatsapp fraud, whatsapp fraud andhra pradesh, whatsapp scam, whatsapp scam andhra pradesh, whatsapp fraud alert, fraud protection whatsapp, fraud on whatsapp, whatsapp message fraud, whatsapp link fraud, cyber fraud, cyber crime, cyber criminals, scamster, whatsapp link fraud, whatsapp frauds, Retd Teacher, Varalakhmi, Annamaya dist, Andhra Pradesh

A woman from Andhra Pradesh recently lost Rs. 21 lakhs from her bank account due to a WhatsApp fraud. Here’s what happened. In a bizarre turn of events on August 22, a woman was duped of Rs. 21 lakhs from her bank account after she received a link on WhatsApp from an unknown number. The woman, named Varalakshmi, is a retired teacher and a resident of Annamayya district in Andhra Pradesh. She lost Rs. 21 lakhs from her bank account due to the WhatsApp fraud, according to the local police.

వాట్సాప్ లింక్ ఫ్రాడ్: రిటైర్డ్ టీచర్ ఖాతా నుంచి రూ. 21 ల‌క్ష‌లు మాయం!

Posted: 08/24/2022 07:39 PM IST
Whatsapp alert ap woman duped of rs 21 lakhs through message link

అందుగలడు ఇందుగలడన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనిపించు శ్రీహరి అన్న విధంగా.. ప్రస్తుత ప్రపంచంలో ఎందెందు వెతికినా కనిపించు ఆన్‌లైన్ మోసాలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం కొన్ని లక్షల మంది ఈ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. ఇక ఈ మోసాలు నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు పిన్ నెంబరు పసిగట్టి.. ఆ తరువాత సందేశాలు, ఆ తరువాత ఈ మెయొల్.. ఆ తరువాత స్మార్ట్ ఫోన్, ఆతరువాత ఫేస్ బుక్, ఇక తాజాగా వాట్సాఫ్ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో రిటైర్డ్ టీచ‌ర్ నుంచి ఓ కేటుగాడు ఇదే త‌ర‌హాలో రూ 21 ల‌క్ష‌లు మోస‌గించాడు.

మ‌ద‌న‌ప‌ల్లె పట్ట‌ణంలో రెడ్డెప్ప‌నాయుడు కాలనీ నివాసి, రిటైర్డ్ టీచ‌ర్ వ‌ర‌ల‌క్ష్మి త‌న ఖాతా నుంచి న‌గ‌దు విత్‌డ్రా అయిన‌ట్టు మెసేజ్ రావ‌డంతో ఆమె స్ధానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియ‌ని కాంటాక్ట్ నుంచి వ‌చ్చిన వాట్సాప్ లింక్‌ను ఆమె క్లిక్ చేసిన వెంట‌నే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి న‌గ‌దు విత్‌డ్రా అయిన‌ట్టు మెసేజ్ వ‌చ్చింది. ఒక్క‌సారిగా ఆమె ఖాతా నుంచి రూ 21 ల‌క్ష‌లు డెబిట్ అయ్యాయి. స్కామ‌ర్లు ఆమె ఖాతాను హ్యాక్ చేసి మొత్తం న‌గ‌దును లూటీ చేసిన త‌ర్వాత వ‌ర‌ల‌క్ష్మి సైబ‌ర్ క్రైమ్‌కు స‌మాచారం అందించారు. వాట్సాప్ లింక్‌ను క్లిక్ చేసిన త‌ర్వాత ఆమె ఖాతాలో న‌గ‌దు మాయ‌మైంద‌ని పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

వాట్సాప్ లింక్స్ ద్వారా సైబ‌ర్ నేరాలు ఇటీవ‌ల పెరిగాయ‌ని ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. లింక్‌ల‌పై యూజ‌ర్లు క్లిక్ చేసిన వెంట‌నే స్కామ‌ర్లు బాధితుల ఫోన్‌, వ్య‌క్తిగ‌త వివ‌రాలు, బ్యాంక్ ఖాతాల‌ను యాక్సెస్ చేసి లూటీల‌కు పాల్ప‌డుతున్నార‌ని చెప్పారు. గుర్తుతెలియ‌ని నెంబ‌ర్‌, వ్య‌క్తుల నుంచి వ‌చ్చే లింక్‌ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని, యూఆర్ఎల్‌ను సరిగ్గా చెక్ చేసుకుని అది స‌రైన లింక్ అని నిర్ధార‌ణ‌కు రావాల‌ని సూచిస్తున్నారు. న‌గ‌దు ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేలా ఉండే లింక్‌లు, మెసేజ్‌ల‌ను క్లిక్ చేయ‌రాద‌ని, వాటిని షేర్ చేయ‌రాద‌ని పోలీసులు కోరుతున్నారు. అలాంటి మెసేజ్‌ల‌ను స్కామ‌ర్లే ఎక్కువ‌గా పంపిస్తుంటార‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles