Zomato delivery partner carries both children to work ఆర్జిస్తూనే జొమాటో డెలివరీ బాయ్ బిడ్డల ఆలనా పాలన..

Zomato delivery partner carries his kids to work internet calls him real hero

zomato delivery stories, zomato delivery, zomato food delivery, zomato stories, woman zomato delivery, zomato, zomato delivery agent, food delivery, viral video, zomato delivery man, deliver man, Saurabh Panjwani, Instagram viral, delivery executive, zomato latest news, zomato update, Haryana

The internet is replete with inspirational stories about food delivery executives overcoming hardships to provide for themselves and their families. Now, a video of a man who works as a delivery partner for Zomato is melting hearts online. Taking to Instagram, food blogger Saurabh Panjwani shared a short video introducing his followers to a delivery agent who carries his daughter and son to every delivery address assigned.

జొమాటో డెలివరీ బాయ్ అర్థాంగి బాధ్యతలు: ఆర్జనతో పాటే బిడ్డల ఆలనా పాలన..

Posted: 08/23/2022 05:04 PM IST
Zomato delivery partner carries his kids to work internet calls him real hero

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరు ఎప్పుడు ఎలా హీరోలుగా మారునున్నారో ఎవరికీ తెలియకుండా పోతోంది. అయితే ఇలా హీరోగా నిలవాలంటే.. వారిలో ప్రత్యేమైన ఓ అలవాటు ఉండాలి. అంతేకాదు దీనిని గుర్తించి సామాజిక మాద్యమాల ద్వారా పబ్లిక్ లోకి తీసుకువెళ్లే మంచి వ్యక్తులు కూడా ఉండాలి. ఈ రెండు కలగలసిన నాడు.. హీరోలుగా నిలవడం కష్టమేమి కాదని తాజాగా మరో ఘటన నిరూపించింది. జొమాటో డెలివరీ బాయ్​కి సంబంధించిన కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తన ఇద్దరు బిడ్డలను మోస్తూ.. అతను ఫుడ్​ డెలివరీ చేసేందుకు వెళుతుండటం వార్తలకెక్కింది.

ఫుడ్​ బ్లాగర్​ సౌరభ్​ పంజ్వాని.. ఈ వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు. ఓ జొమాటో డెలివరీ బాయ్​ని వీడియో తీశాడు. అతడిని తన ఫాలోవర్లకు పరిచయం చేశాడు. ఆ డెలివరీ బాయ్​.. తన పసి పాపను మోస్తూ కనిపించాడు. మరో బిడ్డ.. అతని పక్కనే ఉన్నాడు. "నాకు చాలా ఇన్​స్పైరింగ్​గా అనిపించింది. ఈ జొమాటో డెలివరీ బాయ్​.. తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఫుడ్​ డెలివరీ చేస్తున్నాడు. రోజంతా ఎండలోనే ఉంటున్నారు. మనిషికి ఏదైనా కావాలంటే.. దానిని కచ్చితంగా చేసి తీరుతాడు అని దీని నుంచి మనం నేర్చుకోవాలి," అని వీడియో కింద రాసుకొచ్చాడు సౌరభ్​.

తన కుమారుడు.. ఫుడ్​ డెలివరీలో తనకు సాయం చేస్తాడని ఆ జొమాటో డెలివరీ బాయ్​ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో.. కొన్ని గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిపోయింది. ఈ వ్యవహారంపై జొమాటో కూడా స్పందించింది. "ఆ డెలివరీ బాయ్​ వివరాలను మాకు ప్రైవేటుగా షేర్​ చేయండి. మేము అతనికి సాయం చేస్తాము," అని జొమాటో కామెంట్​ చేసింది. బిడ్డలను మోస్తూ.. ప్రతి చోటకు తిరుగుతున్న జొమాటో డెలివరీ బాయ్​పై ఇప్పుడు సర్వత్రా ప్రసంశలు లభిస్తున్నాయి. 'రియల్​ హీరో అంటే నువ్వే', 'నీకు జోహార్లు' అంటూ నెటిజన్లు రియాక్ట్​ అవుతున్నారు.


జొమాటో ప్రీమియం సేవలు పొందుతున్న యూజర్లకు అలర్ట్​! జొమాటో ప్రీమియం సేవలు నిలిచిపోయాయి. జొమాటో ప్రో, ప్రో ప్లస్​ను నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. 2020 ముందు వరకు జొమాటో 'గోల్డ్​' అందుబాటులో ఉండేది. దానిని అప్​గ్రేడ్​ చేసి.. జొమాటో ప్రోని 2020లో తీసుకొచ్చారు. "జొమాటో ప్రో/ ప్రో ప్లస్​ సేవలను రెన్యువెల్​ చేసుకోలేరు. ఈ సేవలను నిలిపివేస్తున్నాము. యూజర్లకు సరికొత్త అనుభూతిని తీసుకొచ్చే విధంగా.. మా సంస్థ కృషి చేస్తోంది. సరికొత్త అప్డేట్​తో మీ ముందుకొస్తాము," అని సంస్థ ప్రకటన చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles