Income Tax officials raid Phoenix realty group ఫీనిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీపై ఐటీ దాడులు..!

Hyderabad phoenix group offices raided by mumbai it officials

Hyderabad, Mumbai IT officials, it raids, Real Estate company, Phoenix real estate, TRS, Phoenix ventures, Gachibowli, Jubilee Hills, Film Nagar, IT SEZ, Hyderabad, Shamshabad, Crime

The real estate company Phoenix Group here was raided by 200 income tax officials, flown in from Mumbai, on Tuesday. Nearly 20 offices and residential properties of the company’s directors were raided by the IT officials. The raids started at around 4 am. Apart from its main office in Banjara Hills, raids were conducted in Madhapur, Jubilee Hills, and Moosapet. They were conducted on suspicion of tax evasion by the company.

ఫీనిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌, గ్రూప్ కంపెనీలపై ముంబై ఐటీ అధికారుల దాడులు..!

Posted: 08/23/2022 04:11 PM IST
Hyderabad phoenix group offices raided by mumbai it officials

నగరంలోని మరో రియల్ ఎస్టేట్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక దాడులు చేసింది. ఫీనిక్స్‌ కంపెనీపై ఇవాళ ఉదయం నుంచే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించారు. ఫీనిక్స్‌ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయనకు చెందిన హైదరాబాద్, ముంబై సహా పలు ప్రాంతాల్లో దాడులు జరుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఏకంగా 25 వాహనాల్లో.. దాదాపు 150 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. నగరంలో 20 చోట్లకు పైగా ఐటీ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్‌ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఫీనిక్స్‌ సంస్థ ఛైర్మన్‌ చుక్కపల్లి సురేష్‌ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్‌లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఫీనిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపారం చేస్తుండగా.. వెంచర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌ఫ్రాలోనూ ఫీనిక్స్‌ పెట్టుబడులు పెట్టింది.

బర్త్‌ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్లును కూడా ఆహ్వానించడం.. అందుకు వారు కూడా రావడంతో ఐటీ నజర్ లోకి ఈ కంపెనీ వచ్చింది. వేడుకలకు భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారని తెలియడంతో.. ఫీనిక్స్‌ సంస్థలో​ పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం. నగరంలోని డైరెక్టర్ల నివాసాలతో పాటు హైదరాబాద్‌లో వ్యవస్థాపకుడు సురేష్ చుక్కపల్లి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.

ఈ కంపెనీని సురేష్ చుక్కపల్లి సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అయితే కూకట్‌పల్లిలో ల్యాండ్ డీల్ విషయంలో ఫీనిక్స్, మరో రెండు కంపెనీల మధ్య జరిగిన లావాదేవీకి సంబంధించి దాడులు జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే.. వాసవీ గ్రూప్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మళ్లీ.. మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ గ్రూప్‌పై ఏకకాలంలో దాడులు జరిగాయి. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఉన్న కార్పొరేట్ కార్యాలయంతోపాటు 20 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles