BJP MLA Raja Singh arrest over anti-Prophet remarks వీడియో దుమారం: బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

T raja singh arrested bjp takes this step against mla amid prophet remarks row

BJP MLA Rajasingh, Prophet Muhammad, Nupur Sharma, derogatory remarks, massive protests, Goshamahal MLA, MLA Raja Singh, t raja singh, t raja, raja singh video, raja singh news, hyderabad news today, raja singh speech, raja singh arrested, raja singh twitter, goshamahal, raja singh arrest, bjp mla raja singh,Raja Singh, T Raja Singh, t raja, raja singh video, raja singh news, hyderabad news today, raja singh speech, raja singh arrested, raja singh twitter, Goshamahal, Hyderabad, crime

Telangana BJP MLA T Raja Singh who was arrested by Telangana police on Tuesday for alleged derogatory comments against Prophet Muhammad was suspended by the BJP soon after. Singh is notorious for his controversial remarks which have now landed him in legal trouble.

బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. దుమారం రేపుతున్న వీడియో.!

Posted: 08/23/2022 03:19 PM IST
T raja singh arrested bjp takes this step against mla amid prophet remarks row

ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టు చేసిన ఓ వీడియో దుమారం రేపింది. ఆ వీడియోలో ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఓ వర్గానికి చెందినవారు ఆరోప‌ణ‌లు చేస్తూ.. ఆయనపై పోలీసు స్టేషన్లలో పిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సోమవారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమ‌వారం రాత్రి న‌గ‌రంలో ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేపట్టారు. సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ సీవీ ఆనంద్ ఆఫీసుతో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి.

తమ‌ మ‌నోభావాల‌ను రాజాసింగ్ అవ‌మానించిన‌ట్లు ఆందోళ‌న‌కారులు ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో సాహినాయత్‌ గంజ్‌ పోలీసులు రంగంలోకి దిగిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద, గోషామహల్‌లో భారీగా పోలీసులను మోహరించారు. ప్రముఖ కమెడియన్‌ మునావర్‌ ఫారూకి షోను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న రాజాసింగ్.. అందుకు ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వడంతో.. ఆయన షోను అడ్డుకుంటామని హెచ్చరించిన రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అదే సమయంలో మునావర్ షోలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అరోపించారు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. దీనిపై ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అయితే, వీడియోలో మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వర్గం ఆరోపిస్తున్నది. తమ మనోభావాలను రాజాసింగ్‌ దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఈ మేరకు పలువురు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసుల విజ్ఞప్తితో రాజా సింగ్ వీడియోను యూట్యూబ్ నుంచి తొల‌గించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles