Thief Steal bike parked in front of police station రాణా ఆవరణ వెలుపలి నుంచి కానిస్టేబుల్ బైక్ చోరి..

Thief hit the constable s bike parked in front of the police station

Ibrahim Patnam police, bike theft, constable bike, police chage, Nandru Manikyala Rao, Kanchikacherla, Guntur, Vijayawada, Andhra pradesh, crime

A thief stolen constable bike parked in front of the police station. The incident took place at Ibrahimpatnam police station of NTR district. Even though he was in front of the police jeep, without any fear.. without anger.. he walked calmly and stole the bike and ran away. These scenes were recorded on CCTV. The thief was caught within hours in Guntur. The abductor has been identified as Nandru Manikyala Rao (22) of Kanchikacherla.

పోలీస్‌ స్టేషన్ ఆవరణ వెలుపలి నుంచి కానిస్టేబుల్ బైక్ చోరి.. క్షణాల్లో గుంటూరుకు..

Posted: 08/23/2022 12:07 PM IST
Thief hit the constable s bike parked in front of the police station

పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో.. పోలిస్ స్టేషన్ పక్కనే.. పీఎస్ వంద మీటర్ల దూరంలో.. ఠాణాకు అత్యంత చేరువలో అంటూ ఇన్నాళ్లుగా కొన్ని వార్తలు చదివిన పాఠకులకు ఇప్పుడు పోలిస్ స్టేషన్ ఆవరణ నుంచే ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన ఘటన ఏపీలోని `విజయవాడ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో జరిగింది. ఇబ్రహీంపట్నం పిఎస్‌ ఎదుట బండి నిలిపిన కానిస్టేబుల్ వాహనాన్ని ఓ దొంగ ఎలాంటి భయం లేకుండా తన వాహనాన్ని తీసుకెళ్లినట్లే తీసుకెళ్లడం సంచలనాన్ని సృష్టించింది. దివ్యాంగుడిలా కుంటుతూ నడుస్తూ వచ్చి ఎవరు లేకపోవడం గమనించి బండిని మారుతాళంతో తెరిచి జంపయ్యాడు.

పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి చూసిన కానిస్టేబుల్ తన బైక్ లేదని గమనించి.. వెంటనే స్థానికి సిసి టివి కెమెరాలను పరిశీలించగా, ఓ యువకుడు బండిని కొట్టేయడం కెమెరాల్లో రికార్డైంది. మాసిన దుస్తులతో కుంటుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాన్ని సెకండ్ల వ్యవధిలో స్టార్ట్‌ చేసి మాయమైపోయాడు. రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే చోరీ చేసి విజయవాడ మీదుగా గుంటూరు పారిపోయాడు. బేరం కుదిరితే ఆ బండి అక్కడే విడిభాగాలుగా మారిపోయేది. అయితే ఠాణా నుంచి బయటకు వచ్చిన కానిస్టేబుల్ తన వాహనం కనిపించకపోయే సరికి అంతటా వెతికి.. చివరకు సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించాడు.

సిసిటివిల్లో తన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఆగంతకుడిని పాత నేరస్థుడిగా గుర్తించిన పోలీసులు.. వెంటనే అతడి కదలికలు గుర్తించి విజయవాడ మీదుగా గుంటూరు వైపు వెళ్తున్నట్లు కనుగొన్నారు. దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణించి మంగళగిరి సమీపంలో ఉన్న నిందితుడ్ని వెంటాడి పట్టుకున్నారు. అయితే సకాలంలో స్పందించడం కారణంగానే కానిస్టేబుల్ వాహనం యథాతథ స్థితిలో లభ్యమైంది. అయితే సామాన్యప్రజల వాహనాల, ఇతర పిర్యాదులపై పోలీసులు ఇదే విధంగా వేగంగా స్పందించి.. దర్యాప్తును కొనసాగిస్తే ఎంతటి కరుడుగట్టిన దొంగలైనా ఇట్టే దొరికిపోతారనేందుకు ఇది నిదర్శనం.

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేషన్ సోమవారం మధ్యాహ్నం స్టేషన్ బయట బండి పెట్టి లోపలకు వెళ్లాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన నిందితుడు బండిని చూడగానే మాయం చేయాలని నిర్ణయించుకునే దానిపై చెక్కేశాడు. స్థానిక సీసీ టీవీల్లో చోరీ దృశ్యాలు నమోదవడంతో వెంటనే నిందితుడి అచూకీ కోసం ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వైపు బైక్ వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దారి పొడవున పోలీసులు అమర్చిన సిసిటివి కెమెరాల్లో నిందితుడి కదలికలు నమోదవ్వడంతో దొంగను పట్టుకోవడం సులువైంది.

వాహనం గుర్తుల ఆధారంగా ఏ మార్గంలో ప్రయాణించాడో పోలీసులు పసిగట్టేశారు. విజయవాడ మీదుగా మంగళగిరి జాతీయ రహదారి దాటుకుని పెదకాకాని సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ పోలీసులు గుంటూరు అర్బన్ పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో నిందితుడిని వాహనం సహా పట్టుకున్నారు. నిందితుడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అరుంధతీ నగర్‌కు చెందిన నండ్రు మాణిక్యాాల రావుగా గుర్తించారు. చోరీ చేసిన వాహనాన్ని గుంటూరు ఆటోనగర్‌లో పాత వాహనాల విడిభాగాలు విక్రయించే వారికి అమ్మేందుకు తీసుకెళ్తుండగా దొరికిపోయాడు. పోలీసులు ఏ మాత్రం ఆలశ్యం చేసినా ముక్కలై మాయమైపోయేది. మరోవైపు నిందితుడు చోరీ చేసినా ఫలితం దక్కకపోగా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles