Coins worth Rs 11 crore missing from SBI: CBI Searches on ఎస్బీఐలో దొంగలు పడ్డారు.. రూ.11 కోట్ల చిల్లర మాయం.!

Cbi on the search as coins worth rs 11 crore go missing from sbi

Rs 11 crores coins, SBI Bank, Karauli district, Mehandipur Balaji branch, Todabhim police station, Delhi, Rajasthan, CBI Searches, 25 Locations, Arpit Goods Carrier, SBI coins missing, Karauli sbi money missing, Rajasthan, Crime

The Central Bureau of Investigation (CBI) on Thursday conducted searches at 25 locations in Delhi and Rajasthan, officials said Thursday, in connection with the coins worth around Rs 11 crore missing from an SBI branch in Karauli’s Mehandipur Balaji last year.

ఎస్బీఐ బ్యాంకులో దొంగలు పడ్డారు.. రూ.11 కోట్ల చిల్లర మాయం.!

Posted: 08/19/2022 11:50 AM IST
Cbi on the search as coins worth rs 11 crore go missing from sbi

భారతీయ స్టేట్ బ్యాంక్.. దేశంలోనే కాదు ఏకంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ బ్యాంకులో దొంగలు పడ్డారు. అయితే పడింది మాత్రం బయటి దొంగలు కాదు. ఏకంగా ఇంటి దొంగలే. అయితే వీళ్లు ఏం కాజేశారనేగా మీ సందేహం. వీరు ఏకంగా చిల్లర నాణేలు కాజేశారు. ఓస్ అంతేగా.. మహాఅయితే ఏ వెయ్యో లేదా పది వేలో కాజేసుంటారు అంటారా.. అయితే మీరు చిల్లరలో కాలేసినట్టే.. ఎందుకంటే ఈ ఇంటి దొంగలు కాజేసిన మొత్తం తెలిస్తే షాక్ కు గురవుతారు. ఎంతటారా.? ఏకంగా రూ. 11 కోట్లు. ఈ తతంగం అంతా ఎప్పుడో జరిగిపోయింది.

అయితే ఈ పొయిన చిల్లరపై ఏకంగా పోలీసులు కూడా రంగంలోకి దిగేందుకు వారి స్టేషన్లోనూ పిర్యాదు నమోదైంది. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. ఇక సీబిఐ రంగంలోకి దిగింది. రాజస్తాన్‌లో కరౌలీ జిల్లాలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మెహందీపూర్‌ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు  25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు.

ఎస్‌బీఐ మెహందీపూర్‌ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్‌బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్‌ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles