Girl vs Boy Metro Fight Over "Rs 1,000 Zara T-Shirt" ఢిల్లీ మెట్రో రైలులో యువకుడిని చెంపదెబ్బ కోట్టిన యువతి

Watch girl slaps a boy in delhi metro over rs 1 000 zara t shirt

Delhi Metro, Fight, Girl vs Boy Metro Fight, Zara T-Shirt, Girl vs Boy, Metro Fight, crazy viral, content hungers, Delhi, viral video, video viral

A fight on a metro train in Delhi has gone crazy viral. In a video shot by a passenger, a girl is seen slapping and hitting a boy constantly as he returns a blow or too as well, both lacing their cuts with a choice of verbal volleys. "Mummy ko bolungi main" (I will tell mother) and "tere jaisa ladka kiskiko na mile" (No one should get a guy like you) punctuate the mechanical drone of the moving train.

ITEMVIDEOS: ఢిల్లీ మెట్రో రైలులో యువకుడికి చెంపదెబ్బ.. కొట్టిన యువతి..!

Posted: 08/18/2022 09:39 PM IST
Watch girl slaps a boy in delhi metro over rs 1 000 zara t shirt

ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్న‌ప్పుడు అప్పుడ‌ప్పుడూ స‌ర‌దా సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. చిన్న‌చిన్న కార‌ణాల‌కే కొంద‌రు గొడ‌వ‌ ప‌డుతుంటారు. ఆ సీటు నాది అని.. కొంచెం అలా జరగాలని ఇలా పలు చిన్న కారణాలే కానీ.. ఆ సమయంలో మాత్రం అవి పెద్దవే. ఎంత పెద్దవి అంటే..ముక్కుమొఖం తెలియని వ్యక్తులైనా సరే వారితో గొడవ పడిపోతాం. కొంతకాలం తరువాత వాటిని తిరిగి అలోచించుకుంటే.. అబ్బే అలా చేయాల్సింది కాదు.. అని మనకు మనమే నచ్చజెప్పుకుంటాం. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఢిల్లీ మెట్రోలో జ‌రిగింది.
టీ-షర్టు ధ‌ర‌పై మొద‌లైన వాగ్వాదం ఇద్ద‌రి యువ‌తీ యువ‌కుల మ‌ధ్య భౌతిక‌దాడికి దారితీసింది.

ఈ ఘటనను మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంతో అదికాస్తా నెట్టింట్లో విపరీతంగా చ‌క్క‌ర్లుకొడుతోంది. ఇక దీనిపై నెట్ జనుల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి చేతిలో కొన్ని టీ ష‌ర్టులు పట్టుకుని విక్రయించేందుకు వచ్చింది. రైలులో ఉన్న కోందరి వద్దకు చేరుకుని అమె టీషర్టులు అమ్మెందుకు యత్నించింది. ఇంతలో ఓ వ్యక్తి దానిని చూసి  ధర ఎంతై ఉంటుందని అడిగాడు. అమె ధరను వెల్లడించింది. దాంతో పక్కనే ఉన్న ఓ యువకుడు అంత ఉండదు.. రోడ్లపైన అమ్ముతున్నట్లగానే చాలా చౌకగా ఉంటుందని అన్నాడు.

తాను ఈ టీ ష‌ర్టును జ‌రా నుంచి రూ.వెయ్యికి కొనుగోలు చేసిన‌ట్లు చెప్పింది. అంతేకాదు టీ-షర్టు నాణ్యతను చూడాలని చెప్పింది. కావాలంటే టీషర్టును చించాలని సవాల్ చేసింది. అయితే యువకుడు మాత్రం దానిని ఖండిస్తాడు. అది రూ.150 కంటే ఎక్కువ‌గా ఉండ‌ద‌ని యువ‌కుడు పేర్కొన‌గా, యువ‌తి కోపోద్రిక్తురాలైంది. యువ‌కుడి చెంపె చెల్లుమ‌నిపించింది. అలాగే, వ‌రుస‌గా ఆమె చెంప‌దెబ్బ‌లు కొడుతుండ‌డంతో యువ‌కుడుకూడా ప్ర‌తిఘ‌టించాడు. యువ‌తి చెంప చెల్లుమ‌నిపించాడు. యువ‌తీ యువ‌కుల ఆక‌స్మిక చ‌ర్య‌తో అవాక్కైన ప్ర‌యాణికులు, వారు దిగిపోగానే న‌వ్వుకోవ‌డం వినిపించింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను మంద‌ర్ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్ ద్వారా దీనిని షేర్ చేశారు. ఈ ఘటనపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు యువతి.. యువకుడిని చటపటలాడించినా.. యువకుడు మాత్రం కేవలం చెయి లేపాడంతే.. అని యువకుడికి మద్దుతు పలికేవారు కొందరు కాగా, ఇలా చీఫ్ ట్రిక్స్ తో ప్రాంకులు చేసేవారు లేకపోలేదరని.. ఢిల్లీ మెట్రో రైలు యాజమాన్యం ఇలాంటి యువతీ యువకులపై చర్యలు తీసుకుంటేనే.. మిగతావారు అప్రమత్తం అవుతారని మరికొందరు అంటున్నారు. ఇక మరికొందరు ఇంత ఫన్నీగా కొట్టుకుంటున్నారేంట్రా బాబూ.. అంటూ కామెంట్ల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles