Bengaluru-Hyderabad Train Journey Will Be Just Over 2 Hours మూడు గంటల్లో హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం.!

A high speed railway track to cut bengaluru hyderabad travel time to 2 5 hours

Indian Railway, IRCTC,Hyderabad, bengaluru, Infrahub, Rajya sabha, Nitin gadkari, semi-high-speed track, two metropolises, IT hubs, speed rail connectivity, railway news

The two flourishing IT hubs of the nation, Bengaluru and Hyderabad, might get closer in terms of rail connectivity as the Indian Railways is reportedly considering building a semi-high-speed track between the two metropolises. India InfraHub in its report has stated that the railway track is compatible for running trains at a speed of 200 km per hour and the travelling time between two cities can soon be reduced to two-and-a-half hours that is 150 minutes.

ఇక హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం మూడు గంటల్లో వెళ్లొచ్చు!

Posted: 08/18/2022 08:18 PM IST
A high speed railway track to cut bengaluru hyderabad travel time to 2 5 hours

హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రైలు ప్రయాణానికి పది గంటలు లేదా 11 గంటలు పడుతుంది. ఇకపై కేవలం రెండున్నర గంటల్లోనే బెంగళూరుకు వెళ్లొచ్చు. దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఐటీ హాబ్ కేంద్రాలు బెంగళూరు, హైదరాబాద్ కావడంతో వీటి రెండింటి మధ్య దూరాన్ని చేరువ చేసే ప్రయత్నం సాగుతోంది. అదెలా సాధ్యమంటారా.. ఇక హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు చేరుకోవాలంటే ఆ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే ఈ రెండు నగరాల మధ్య దూరం తగ్గుతోంది. ఇందుకోసం ఈ రెండు నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం బెంగళూరు-హైదరాబాద్ మధ్య వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇందుకోసం అనేకమంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఈ రెండు మార్గాలతో పాటు సొంత వాహనాల్లో వెళ్లినా.. ఏకంగా 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అయినా ఈ మార్గాల్లో రైళ్లు, బస్సులు ఎప్పుడూ ఫుల్ గానే వెళ్తాయి. కొన్ని సార్లు సీట్లు లేక ప్రయాణాన్ని వాయిదా పడుతుంటాయి. రెండు శరవేగంగా ఐటీ రంగాలలో అభివృద్ది చెందుతున్న నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గాలని ఎప్పుటినుంచే ప్రయాణికులు కోరుకుంటున్నారు.

ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గాలంటే శరవేగంగా ప్రయాణించే రైళ్లు కావాలన్నది కూడా అలోచన. వారి అలోచనలకు అనుగూణంగానే త్వరలో హైస్పీడ్ రైలు సిద్దం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే.. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు కేవలం 150 నిమిషాల్లో ప్రయాణించగలరు. రెండు నగరాలను సెమీ హై స్పీడ్ రైలుతో అనుసంధానించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సెమీ హై స్పీడ్ ట్రాక్‌ను నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గంటకు 200 కి.మీ వేగంతో రైళ్లను నడిపేందుకు రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. ఇది పూర్తైతే.. రెండున్నర గంటలకు ప్రయాణం తగ్గిపోతుంది.

నివేదికల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతిశక్తి చొరవలో భాగంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బెంగళూరులోని యలహంక స్టేషన్‌ నుంచి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ మధ్య 503 కిలోమీటర్ల మేర రైలు నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. భద్రతా కోసం ఈ సెమీ హై స్పీడ్ రైల్వే ట్రాక్‌కి ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్ వేస్తారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రైలు ప్రతిపాదిత వేగంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా నడపడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త సెమీ హైస్పీడ్ రైలుతో కేవలం 150 నిమిషాల్లో ప్రయాణించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles