Mother Saves Child From Huge Cobra In Bone-Chilling Video నాగుపాము కాటు నుంచి బిడ్డను క్షణాల్లో తప్పించిన తల్లి

Woman saves son from giant cobra in scary viral video from karnataka

snake, cobra, viral, video, save, mother, woman, boy, child, terrifying, scary video, bone chilling video, Mandya, Karnataka, viral video, reptile video

In a bone-chilling incident that took place in Karnataka, a woman rushed to save her child from a huge cobra that was looming around the house. The entire scenario was caught on CCTV and the footage has now gone viral all over the Internet. In the clip, a little boy can be seen stepping outside the house all dressed up, while his mother was right behind him. The incident happened in the Mandya district of Karnataka.

ITEMVIDEOS: కాటు వేసేందుకు సిద్దమైన నాగుపాము.. బిడ్డను కాపాడుకున్న తల్లి

Posted: 08/13/2022 08:00 PM IST
Woman saves son from giant cobra in scary viral video from karnataka

తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంటుందని ఇటీవల పశ్చిమబెంగాల్ లో జరిగిన ఘటన కూడా నిరూపించింది. అలాంటిది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ, మమకారం, రక్షణ ముందు.. ఎవరూ సాటిరారన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కోడుతోంది. ఓ తల్లి తన  చిన్నారి కన్నకొడుకు శరవేగంగా స్పందించి రక్షించిన వీడియో నెటిజనుల వెన్నులో వణుకుపుట్టించింది.

తన బిడ్డఒక తల్లి తన కుమారుడ్ని పెద్ద నాగుపాము బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు అతడితోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళ్తున్నది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు. దీంతో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది. పెద్ద ఎత్తున పైకిలేచింది.

ఊడిన బూటు కోసం దగ్గరకు వస్తున్న బాలుడ్ని ఆ పాము కాటేయబోయింది. మరోవైపు పామును గమనించిన తల్లి క్షణాల్లో స్పందించింది. పాము కాటువేయబోతున్న కుమారుడ్ని వెంటనే పక్కకు లాగింది. బాలుడ్ని ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లింది. దీంతో ఆ పాము పాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. క్షణాల్లో స్పందించి పాము బారి నుంచి కుమారుడ్ని కాపాడిన ఆ తల్లిపై ప్రశంసలు కురిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snake  cobra  viral  video  save  mother  woman  boy  child  terrifying  scary video  bone chilling video  Mandya  Karnataka  viral video  reptile video  

Other Articles

Today on Telugu Wishesh