Telangana to receive light to moderate rainfall till 19 August రాష్ట్రంలో ఈ నెల 19 వరకు తేలికపాటి వర్షాలు

Another low pressure to form in bay of bengal on 19th august

light rain, telangana, average rainfall, large excess rainfall, excess rainfall, seven districts of Telangana, India Meteorological Department (IMD), red alert to Adilabad, red alert to Kumram Bheem Asifabad, red alert to Mancherial, red alert to Nirmal, red alert to Jagtial, red alert to Jayashankar Bhupalpally, orange alert to seven districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet districts, Yellow alert to remaining districts of telangana, Yellow alert to Hyderabad

Another low-pressure area is likely to form over the North-west Bay of Bengal around August 19, informed the India Meteorological Department (IMD) on Monday. According to the MeT department, under the influence of the cyclonic circulation over Northwest Bay of Bengal & neighbourhood, a low pressure area is likely to be formed over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 19న ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ

Posted: 08/16/2022 11:59 AM IST
Another low pressure to form in bay of bengal on 19th august

వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో కుండపోత వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు శాంతించాడని భావిస్తున్న క్రమంలో మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది హైదరాబాద్ వాతావరణశాఖ. బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర చత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతూ వాయవ్య, పశ్చిమ ప్రాంతాల మీదుగా కదిలి బలహీనపడుతుందని చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ ఆ వెంటనే మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తాజాగా చెప్పింది. బంగాళఖాతంలో ఈ నెల 19 వరకు ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఒడిశాపై తీవ్రంగా పడనుందని.. ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇటు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపునందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ.. ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. కాగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్పపీడన ప్రభావం ఏర్పడనుందని తెలిపింది. ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles