Redneck Fishing Tournament returns to the Village of Bath ‘‘చేపలే ఎగురుతూ ఎదురోస్తే..’’ రెడ్ నెక్ ఫిషింగ్ టోర్నీ చిత్రమిదే..

Redneck tournament takes off as fish jump like popcorn from illinois river

redneck fishing tournament, competition, great lakes, invasive carps, fishing, environment, water bodies, Great Lakes region, illinois, USA, viral video

A one-of-a-kind fishing competition, called the Red Neck Fishing Tournament, has taken off in Illinois. The competitors are armed with nets and helmets as they embark on a journey to catch invasive carp from the Great Lakes region. Jim Vorass, a competitor, said that the fish “jump like popcorn" as they set out to catch them. He compared it to being on a rollercoaster for the first time.

ITEMVIDEOS: ‘‘చేపలే ఎగురుతూ ఎదురోస్తే..’’ రెడ్ నెక్ ఫిషింగ్ టోర్నీ చిత్రమిదే..

Posted: 08/10/2022 01:57 PM IST
Redneck tournament takes off as fish jump like popcorn from illinois river

ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు విసిరి లాగాలి. అక్కడా చేపలు పడతాయి.. కానీ పడింది చేపో లేక సొరచేప అన్నది తెలియాలంటే.. మాత్రం వలను పైకి లాగిన తరువాత.. అయితే ఎన్ని చేపలు పడ్డాయన్న విషయం కూడా అప్పుడే తెలిసేది. ఇలా కాకుండా ఏకంగా చేపలే మీ వైపు ఎగిరొస్తే.. ఎగిరొచ్చి మరీ మీ చేతుల్లోని జాలీల్లో పడి పోతుంటే.. అది భలేగా ఉంటుంది కదా..

అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ జరిగిన ‘రెడ్ నెక్ టోర్నెమెంట్’ సందర్భంగా ఇలా చేపలు ఎగురుతున్న వీడియో వైరల్ గా మారింది. ఇల్లినాయస్ లోని మంచి నీటి రిజర్వాయర్ల లో ఓ రకం చేపలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఏటా ఆ చేపలను పట్టేసే లక్ష్యం ఓవైపు.. సరదా పోటీ మరోవైపు కలిసి.. ‘రెడ్ నెక్ ఫిషింగ్ టోర్నమెంట్’ను నిర్వహిస్తుంటారు. అలా ఇటీవలే ఈ టోర్నీ జరిగింది. చాలా మంది బోట్లు వేసుకుని, చిన్నపాటి వలలు పట్టుకుని రంగంలోకి దిగారు.

అదేంటి చిన్నపాటి వలలు ఎందుకు ఏకంగా పెద్ద వల పట్టుకెళితే అన్నీ పడతాయి కదా.. అంటే.. ఇక్కడే ఓ చిన్న షరతు విధించారు. చేపలు నీళ్లలో ఉన్నప్పుడు పట్టుకోరాదు. నీళ్లపై అవి ఎగిరనప్పుడే వాటిని వలల సాయంతో పట్టుకోవాలి. ఇలా ఎవరు ఎన్ని చేపలను పట్టుకోగలుగుతారన్నది పందెం. అంతేకానీ నీళ్లలోని చేపలన్నింటినీ పట్టుకోవడం ఈ టోర్నీలో భాగమే కాదు. అయితే అన్నీ వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లు కావడం, వలలు పట్టుకుని తిరుగుతుండటంతో.. రిజర్వాయర్ లో చేపలు ఆగమాగం అయ్యాయి. బోట్లు, వలలు సమీపిస్తున్న కొద్దీ నీటిలో ఎగిరి దూకడం మొదలు పెట్టాయి.

ఇలా ఎగురుతున్నప్పుడు పోటీ దారులు చటుక్కున తమ చేతుల్లో ఉన్న జాలీలతో పట్టేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు దీనిని వీడియో తీశారు. వేడి గిన్నెలో పాప్ కార్న్ ఎగిరిపడుతున్నట్టుగా చేపలు ఎగురుతున్నాయంటూ ఈ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో.. లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. ఈ పోటీలో ఎవరు ఎక్కువ చేపలు పడితే.. వారికి బహుమతులు ఇస్తుంటారు. కానీ ఆ చేపలను మాత్రం తినేందుకు వాడరు. ఎందుకంటే ఆ రకం చేపలు తినేందుకు పనికిరావని.. వాటిని జంతువులకు ఆహారంగా, ఎరువులుగా ఉపయోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles