ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా రాయడమే కాక... హృదయాలను తాకేలా పాడారు. మహిళలను, యువతరాన్ని, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని ఆయన సంధించిన ఈ పాట నిజంగానే సమాజంలోని ఆయా వర్గాలను తట్టి లేపినట్టుగా ఉంది. అడక్కుతింటే కడపు నిండదు.. గుద్ది గుంజుకుందామురా.. అంటూ నేటి యువతరం శైలిలో కొత్తగా హక్కుల కోసం పోరాడేందుకు కదలండీ అంటూ నినదించారాయన.
గద్దర్ రాసి.. స్వరపర్చిన ఈ విప్లవ గీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీని అందించారు. బొమ్మాకు మురళి నిర్మిస్తున్న సినిమా కోసం గద్దర్ ఈ పాటను పాడారు. ఈ సినిమాలో సీనియర్ నటి సితార, రాజకీయ నేత అద్దంకి దయాకర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి ఈ సినిమాను నిర్మించారు. ఆ పాట సాగిందిలా.. బానిసలారా లెండిరా.. ఓ నా బానిసలారా.. పుట్టుకతో ఎవరు బానిసలు కారు. అధికారం, దౌర్జన్యం. అణచివేత, అర్థిక దోపిడీ.. మనిషిని, మానవత్వాన్ని బానిస సంకెళ్లతో బంధించారు.. లెండి.. రండి.. బానిసలారా.. బానిసలారా లెండిరా.. ఈ బాంచన్ బతుకులు వద్దురా.. అడుక్కతింటే మన ఆకలి తీరది.. గుద్ది గుంజుకుందామురో..
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more