Congress workers stage protest against inflation, unemployment ధరాఘాతం, నిరుద్యోగంపై కదం తొక్కిన కాంగ్రెస్..

Congress protest congress protest against inflation unemployment rahul priyanka detained

congress march to rashtrapati bhawan, congress rashtrapati bhawan march, congress rashtrapati bhavan march, congress protest against price rise, congress inflation protest, price rise protest congress, congress pm house gherao, Congress, GST, Inflation, congress Protest, Rashtrapati bhawan, PM House, Rahul Gandhi, Priyanka Gandhi, Inflation protest, National Politics

Over 300 Congress leaders, including Rahul and Priyanka Gandhi as well as Shashi Tharoor, were detained in Delhi amid the party’s nationwide protest against the Centre on issues of inflation, unemployment and GST on food items. “Total 335 protesters including 65 MPs have been detained under 65 Delhi Police Act in order to maintain law & order in the area… The protesters tried to obstruct the police officers from performing their duties, manhandled & injured them. Appropriate legal action is being taken,” said Delhi Police.

ధరాఘాతం, నిరుద్యోగంపై కదం తొక్కిన కాంగ్రెస్.. రాహుల్, ప్రియాంక సహా కార్యకర్తల అరెస్ట్

Posted: 08/05/2022 06:38 PM IST
Congress protest congress protest against inflation unemployment rahul priyanka detained

దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు.. నిరుద్యోగం. రైతు ఉత్పాదనలపై జీఎస్టీ వర్తింపులను నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇవాళ దేశవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు న‌లుపు రంగు దుస్తుల్లో ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివసించే రాష్ట్రపతి భవన్ లను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చి.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగ సమస్యలకు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు తలపెట్టిన ఈ ఆంధోళనలో భాగంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

దేశ‌వ్యాప్త ఆందోళ‌నలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ఇవాళ సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేలు న‌ల్ల దుస్తులు వేసుకుని మరీ అందోళనలో పాల్గోన్నారు. రాహుల్ బ్లాక్ క‌ల‌ర్ షర్ట్ వేసుకోగా, ప్రియాంకా బ్లాక్ సూట్ వేసుకున్నారు. ప్ర‌ధాని మోదీని హిట్ల‌ర్‌తో పోల్చారు రాహుల్‌. హిట్ల‌ర్ కూడా ఎన్నిక‌లు గెలిచాడ‌ని, అత‌ను ఎలా గెలిచాడ‌నుకుంటున్నారు, జ‌ర్మ‌నీలోని అన్ని ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల్ని త‌న గుప్పిట్లోకి తెచ్చుకున్నాడ‌ని, నాకు వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా అప్ప‌గిస్తే, అప్పుడు ఎన్నిక‌లు ఎలా గెల‌వాలో చూపిస్తాన‌ని రాహుల్ అన్నారు. ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద ప్రియాంకా వ‌ద్ద రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న చేప‌ట్టారు.

రాహుల్ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్య ఖూనీని తిల‌కిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. శ‌తాబ్ధం క్రిత‌మే ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన ఇండియాను మ‌న కండ్ల ముందే నాశ‌నం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. నియంతృత్వ పోక‌డకు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన‌వాళ్ల‌ను దారుణంగా అటాక్ చేస్తున్నార‌ని, జైలులో వేస్తున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. తాము ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్న‌ట్లు తెలిపారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని, నిరుద్యోగం పెరిగింద‌ని, స‌మాజంలో హింస కూడా అధిక‌మైన‌ట్లు రాహుల్ అన్నారు.

కానీ వీటి గురించి మాట్లాడ‌కుండా ప్ర‌భుత్వం విప‌క్షాల‌ను అణిచివేస్తోంద‌న్నారు. కేవ‌లం న‌లుగురు లేదా అయిదుగురి ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని, ఇద్ద‌రు ముగ్గురు చేసిన వ్యాపారానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందోని ఆరోపించారు. సీడ‌బ్ల్యూసీ స‌భ్యులు, సీనియ‌ర్ నేతలు ఇవాళ ప్ర‌ధాని ఇంటిని చుట్టుమ‌ట్ట‌నున్నారు. ఇక లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు చ‌లో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. దేశంలో ప్ర‌తి ప్ర‌భుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ ఆధీనంలోకి వెళ్లిపోయిన‌ట్లు ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వ స‌మ‌యంలో మౌళిక‌స‌దుపాయాలు త‌ట‌స్థంగా ఉండేవ‌ని, కానీ ఇప్పుడు ఒకే పార్టీ త‌ర‌పున ప్ర‌భుత్వ సంస్థ‌లు ఉన్న‌ట్లు తెలిపారు. స్టార్ట‌ప్ ఇండియాతో చాలా మంది రోడ్డున ప‌డ్డార‌న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles