RBI increases the repo rate by 50 points మళ్లీ పెరిగిన రెపోరేటు.. కరోనా ముందు గరిష్టాన్ని ధాటిన వైనం..

Reserve bank of india second 50bps hike repo rate s now over pre pandemic level

RBI, MPC, CRR, Inflation, Monetary policy, June RBI MPC Meet results, RBI MPC meet live, RBI MPC Live, RBI live news, monetary policy review, Cash Reserve Ratio, Reserve Bank Governor, Shaktikanta Das, Shaktikanta Das live, Monetary Policy Statement 2022, 2022 Monetary Policy Statement

The rate-setting panel of the Reserve Bank of India (RBI) hiked the key lending rate, the repo rate, by 50 basis points (bps), taking the policy rate back to the late-2019 levels. One bps is one-hundredth of a percentage point. With the latest hike from the six-member Monetary Policy Committee (MPC), the repo rate now stands at 5.4 per cent.

మళ్లీ పెరిగిన రెపోరేటు.. కరోనా ముందు గరిష్టాన్ని ధాటిన వైనం..

Posted: 08/05/2022 05:43 PM IST
Reserve bank of india second 50bps hike repo rate s now over pre pandemic level

రెపో రేటును మరోమారు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పెంచేసింది. కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ. ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన సమావేశంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ వివరాలను వెల్ల‌డించారు. బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే వ‌డ్డీల‌ను రెపో రేటుగా పిలుస్తారు. రెపో రేటు పెంచ‌డం అంటే, ఇక క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, లేదా వ్య‌క్తుల‌కు రుణాలు తీసుకోవ‌డం భారంగా మారుతుంది. 50 బేసిస్ పాయింట్లు పెంచ‌డంతో.. రెపో రేటు 5.4 శాతానికి చేరిన‌ట్లు శ‌క్తికాంత్‌దాస్ వెల్ల‌డించారు.

రెపో రేటును పెంచ‌డం వ‌రుస‌గా ఇది మూడ‌వ‌సారి. రోనా రాక ముందున్న 5.15 శాతాన్ని దాటిపోయింది. ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధిలో నియంత్రించేందుకు, అదే సమయంలో వృద్ధికి మద్దతునిస్తూ సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఈ కారణంగా రుణ‌ప‌ర‌ప‌తి క‌ల్ప‌న కోసం ఆర్బీఐ మ‌ద్ద‌తుపై బ్యాంకులు శాశ్వ‌తంగా ఆధార‌ప‌డొద్ద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ చెప్పారు. త‌మ రుణ ప‌ర‌ప‌తి ల‌క్ష్యాల సాధ‌న కోసం బ్యాంకులు మ‌రిన్ని డిపాజిట్లు సేక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శుక్ర‌వారం మీడియాకు చెప్పారు.

బ్యాంకులు అధిక డిపాజిట్లు సేక‌రించిన‌ప్పుడు మాత్ర‌మే రుణ ప‌ర‌ప‌తి క‌ల్పించ‌డానికి నిల‌క‌డ ల‌భిస్తుంద‌న్నారు. బ్యాంకులు త‌మ సొంత ఆదాయ మార్గాల్లో నిధులు స‌మ‌కూర్చుకోవాల‌ని తెలిపారు. ఆర్బీఐ రెపోరేట్ పెంచుతుండ‌గానే బ్యాంకులు త‌మ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు పెంచేస్తున్నాయ‌ని, ఈ ధోర‌ణి కొన‌సాగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు శ‌క్తికాంత‌దాస్ అన్నారు. ఆర్బీఐ శుక్ర‌వారం 50 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మే నెల నుంచి ఆర్బీఐ రెపోరేట్ పెంచ‌డం ఇది మూడోసారి. తాజాగా 50 బేసిక్ పాయింట్లు పెంచ‌డంతో ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతానికి చేరుకున్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles