వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ కొన్ని టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన ఒక మహిళతో మాట్లాడుతున్నట్టున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ స్పందిస్తూ... ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇది మార్ఫింగ్ వీడియో అని అన్నారు. ఈ వీడియో తొలుత ఏబీఎన్ లో ప్రసారమయిందని చెప్పారు.
దీని వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని అన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియోలో ఉన్నది తానే అని నిరూపిస్తే తన తల నరుక్కుని ఏబీఎన్ రాధాకృష్ణ కాళ్ల దగ్గర పెడతానని చెప్పారు.
ఈ వీడియో అంశంపై, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు... మీడియాకు గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకు అసలు సంబంధమే లేదని అన్నారు. వీటిలో ఏది ఒరిజినల్ వీడియో అనేది తేలాలంటే.... రెండు వీడియోలను వేరే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని చెప్పారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుందని అన్నారు. పార్లమెంటు సాక్షిగా గోరంట్ల మాధవ్ తనను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ న్యూడ్ వీడియో వ్యవహారంపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more