Outrage in China after toddler run over, ignored కదులుతున్న కారులోంచి బయటపడిన బాలిక..

Shocking video from china where child fell out of moving car s window

south china morning post, china, cctv, netizens, scmp, ningbo, Parenting, Cars, Viral video, video viral, china child falls from moving car, car driver not notices the child fall, children seat belt, social media, shocking footage

A shocking footage has emerged on the social media, said to be from China, where a little girl is looking out of a car window unbeknownst to the driver and then falls off the car through window, as the unmindful driver drives off.

ITEMVIDEOS: కదులుతున్న కారులోంచి బయటపడిన బాలిక.. వీడియో

Posted: 08/04/2022 01:37 PM IST
Shocking video from china where child fell out of moving car s window

కమ్యూనిస్టు దేశం చైనాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకున్నది. రాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉన్న నింగ్బో పట్టణంలోని ఓ జంక్షన్‌లో కారులోంచి ఓ బాలిక రోడ్డుపై పడింది. అయితే బాలిక కారులోంచి కిందపడినా ఆ కారులో ఉన్న అమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించికుండా వెళ్లిపోయారు. అయితే వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఈ ఘటనను చూసి.. చిన్నారిని లేపి రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లారు. చిన్నారికి ఏమైనా గాయాలయ్యాయా.. అని పరిశీలించి వారు స్థానిక అసుపత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

చైనాలోని నింగ్ బో నగరం.. అక్కడి ఓ జంక్షన్ వద్ద ఓ వైపున రెడ్ సిగ్నల్‌ పడింది. దీంతో వాహనాలు తమ వంతు కోసం ఆగిఉన్నాయి. ఈ క్రమంలో ఓ కారు వెనక సీటులో కూర్చోని ఉన్న చిన్నారి.. కారు డోరులో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్నది. ఏదో ఆకర్షణీయంగా కనిపించిందో ఏమో తెలియదు కానీ కాసింత ఒంగి చూసింది. అయితే అదే సమయంలో వాహనాలు వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో డ్రైవర్‌ కారును ముందుకు కదిలించాడు. ఆ కుదుపుకు చిన్నారి కారులో నుంచి కిందపడిపోయింది. అంతేకాదు కిందపడటంతో దెబ్బలు తగిలాయో ఏమో.. రోడ్డుపైనే బోరున ఏడ్చేసింది.

అయితే చిన్నారిని ఏమాత్రం గమనించకుండా డ్రైవర్‌ వెళ్లిపోయాడు. కిందపడిపోయిన ఆ బాలిక షాక్‌లో ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. అయితే వెనుక వస్తున్న కారు డ్రైవర్‌ అది గమనించి.. వాహనాన్ని ఆపాడు. ఆమెను ఫుట్‌పాత్‌పైకి తీసుకెళ్లాడు. ఇదంతా ఆ జంక్షన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కాగా, ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని, చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని స్థానిక మీడియా ఎస్‌సీఎంపీ తెలిపింది. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ షేరింగ్‌ అవుతున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south china morning post  china  cctv  netizens  scmp  ningbo  Parenting  Cars  Viral video  Social media  

Other Articles