AP farmer strikes Rs 40 lakh diamond in field రైతును వరించిన అదృష్టం.. పొలంలో లభించిన వజ్రం

Kurnool farmer of andhra pradesh stumbles upon diamond worth rs 40 lakh

Diamond, Jonnagiri Farmer, Agriculture land, Thuggali farmer, farmer found diamond while tilling land, Rs 25 Lakhs, Diamond merchant, Rs 40 lakh, field,Farmer,Diamond,agricultural fields at Thuggali, Kurnool, Diamond in Agriculture land, Andhra Pradesh

A farmer in Jonnagiri inThuggali mandal has reportedly found a diamond in his agriculture land while tilling the land for farming. He also sold the diamond to a diamond merchant for Rs 25 Lakhs. But sources say that its worth more than Rs 40 Lakhs in market.

రైతును వరించిన అదృష్టం.. పొలంలో లభించిన వజ్రం

Posted: 08/03/2022 01:38 PM IST
Kurnool farmer of andhra pradesh stumbles upon diamond worth rs 40 lakh

నుదుటన రాసి ఉండాలే కానీ.. భూమి పోరల్లో దాక్కున్న అదృష్టం కూడా వచ్చి తగలక మానదు. తగు సమయం, సందర్భంలో ఆరు నూరైనా అదృష్టం వచ్చి తగులుతుందని పెద్దలు చెప్పిన మాటలు అక్షరసత్యాలను మరోమారు నిరూపితమైంది. పొలంలో పనులు చేసేందుకు వెళ్లిన ఓ రైతుకు అరుదైన వజ్రం లభించింది. దాని ధర కూడా లక్షల్లో ఖరీదు చేసింది. రాత్రికి రాత్రే రైతును లక్షాధికారిని చేసినా పూర్తి అదృష్టాన్ని అందుకోవడంలో రైతు సహనం పరీక్ష పెట్టింది. స్థానిక వజ్రాల వ్యాపారి దానికి అరవై శాతం ధరకే సొంత చేసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగరి గ్రామానికి చెందిన రైతు కష్టాలను ఒక్కదెబ్బతో హరించేట్టు చేసింది. వ్యవసాయ పనుల కోసం పోలాని వెళ్లిన రైతును లక్షాధికారిని చేసింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి కళకళలాడిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో జొన్నగిరి రైతుల్లో ఒకరిద్దరైనా రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఆ మట్టిలో విలువైన వజ్రాలు దాగి ఉండడమే అందుకు కారణం. వర్షం కారణంగా మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడుతూ ఉంటాయి.

అందుకనే ఒక్క జొన్నగిరివాసులు మాత్రమే కాదు.. చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచి కూడా వచ్చి జొన్నగిరిలో వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. తాజాగా, పొలంలో పనిచేసుకుంటున్న జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం అతడిని లక్షాధికారిగా మార్చింది. పొలం పనులు చేస్తుండగా ఓ రాయి మెరుస్తూ కనిపించింది. అంతే దానిని తీసుకుని పరిశీలించగా అది వజ్రం అని తెలిసింది. విషయం తెలిసిన ఓ వ్యాపారి దానిని రూ. 25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles