పిరమిడ్ లకు ప్రసిద్ధిగాంచిన ఈజిప్టు దేశంలో అత్యంత ప్రాచీన సూర్యదేవాలయం బయటపడింది. ఇక్కడి అబూసిర్ ప్రాంతంలో ఇటలీ, పోలెండ్ పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో సూర్యదేవాలయ నిర్మాణాలు వెలుగుచూశాయి. ఈ సూర్యదేవాలయం 4,500 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. క్రీస్తు పూర్వం 2465-2323 కాలం నాటిదని అంచనా. ఫారో చక్రవర్తులు పాలించిన గడ్డపైనా సూర్యోపాసన సాగిందనడానికి ఈ ఆలయమే నిదర్శనం. ఈ ఆలయాన్ని నుసెర్రే అనే రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
కాగా, ఈ తవ్వకాల్లో ఆలయ నిర్మాణాలే కాదు, పలు పాత్రలు, గ్లాసులు తదితర వస్తువులు కూడా బయల్పడ్డాయి. దీనికి సంబంధించి ఈజిప్టు కళాఖండాలు, పర్యాటక మంత్రిత్వ శాఖ జులై 31న ప్రకటన చేసింది. ప్రాచీన ఈజిప్టు ప్రజలు సూర్య దేవత అయిన 'రా'ను పూజించేవారు. సూర్యుడు శక్తిప్రదాత అని అక్కడి ప్రజల నమ్మకం. డేగ తలతో ఉన్న సూర్యదేవత రా చిత్రాలు గతంలో వెలుగుచూశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more