MLA Komatireddy Rajagopal Reddy resigns from Congress కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా..

Munugode mla komatireddy rajagopal reddy resigns from congress

congress MLA, Komatireddy Rajagopal Reddy, Munugodu, Nalgonda, komatireddy venkat reddy, congress, Munugode, Bhatti Vikramarka, Madhu Yashki, Revanth Reddy, TPCC, Congress, BJP, Telangana, Politics

Putting an end to suspense and speculation, senior Congress leader MLA from Telangana’s Munugode constituency, Komatireddy Rajagopal Reddy on Tuesday announced his resignation from the Congress party and also as a legislator.

కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా.. ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా..

Posted: 08/02/2022 08:21 PM IST
Munugode mla komatireddy rajagopal reddy resigns from congress

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. మునుగోడులో ఎవ‌రు గెల‌వాల‌న్న‌ది నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని రాజ‌గోపాల్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల కోస‌మే రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పారు. అవ‌మానాలు భ‌రిస్తూ పార్టీలో ఉండ‌లేను. అవ‌మానాలు భ‌రించ‌లేక‌నే పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నానని స్ప‌ష్టం చేశారు. నా వ్యాపారానికి, రాజ‌కీయ జీవితానికి ఎలాంటి సంబంధం లేద‌ని రాజ‌గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. రేవంత్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. త‌నలో ఇన్నాళ్లు దాగి ఉన్న ఆవేశాన్ని వెళ్ల‌గ‌క్కారు. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డింద‌న్నారు. సోనియాను 20 ఏండ్ల పాటు తిట్టిన వ్య‌క్తిని తీసుకొచ్చి పీసీసీ అధ్య‌క్షుడిని చేశారు. సోనియా అంటే ఎంతో గౌర‌వ‌మున్న తాము.. రేవంత్ కింద ప‌ని చేయాలా? అని ప్ర‌శ్నించారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో చిత్త‌శుద్ధిగా ప‌ని చేసిన తాము.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వ్య‌క్తి కింద ప‌ని చేయ‌లేమ‌ని తేల్చిచెప్పారు.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని సీఎం చేయాలా? అని కాంగ్రెస్‌ను ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ త‌న మీద ఎందుకు యాక్ష‌న్ తీసుకుంటుంది. తాను ఏం త‌ప్పు చేశాను అని అడిగారు. ఏ చ‌ర్చ‌కైనా సిద్ధ‌మ‌ని తేల్చిచెప్పారు. అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా బ‌ల‌హీన ప‌డింద‌ని రాజ‌గోపాల్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో క‌మిటీలు వేసిన‌ప్పుడు కూడా క‌నీసం త‌న‌ను సంప్ర‌దించ‌లేదు. కాంగ్రెస్ పార్టీలో త‌న‌ను ఘోరంగా అవ‌మానించారు. అవ‌మానాలు భ‌రిస్తూ పార్టీలో ఉండ‌లేను. అవ‌మానాలు భ‌రించ‌లేక‌నే పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నానని రాజ‌గోపాల్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress MLA  Komatireddy Rajagopal Reddy  Munugodu  Nalgonda  Revanth Reddy  TPCC  Congress  BJP  Telangana  Politics  

Other Articles