పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రం గుజారాత్ పై కన్నేసింది. గుజరాత్ ను కూడా తమ ఖాతాలో వేసుకునేలా పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా అమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్ర యువతను లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లుగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్న నాయకులు ఆచరణలో మాత్రం యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని గ్రహించిన ఆప్ యువతను ఆకర్షించేలా కీలక ప్రకటనలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలకు ఎన్నికల హామీలను కురిపించారు. కాగా ఈ ఎన్నికల హామీలు యువతను ఆకట్టుకునేలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ లో ఆప్ అధికారంలోకి వస్తే.... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఏకంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని హామి ఇచ్చారు. అంతేకాదు ఐదేళ్ల కాలంలో ప్రతీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాన్ని కల్పించడమే తమ పార్టీ లక్ష్యంగా చెప్పుకోచ్చారు. ఇక అప్పటికీవరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని తెలిపారు. యువతలో అత్యధిక శాతం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోంటున్నారని గ్రహించిన ఆయన వారిని ఆకర్షించేలా హామీని ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 06 | ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు... Read more
Aug 06 | భర్త నుంచి జీవన భృతి కోరుతూ కోర్టుకెక్కిన ముస్లిం మహిళకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో గత తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. షరియత్ చట్ట నిబంధలనకు... Read more
Aug 06 | తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన... Read more
Aug 06 | ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను... Read more
Aug 06 | మధుమేహం.. షుగర్.. ఎలా పిలిచినా ఒకసారి దాని బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క మందులే కాదు.. ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్... Read more