Facts about Hellfire Ninja Missile that killed al-Qaeda chief హెల్‌ఫైర్ నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్ దాడితోనే అల్ జవహారీ హతం..

What is hellfire r9x missile secret weapon that killed al qaeda chief al zawahiri

hellfire, hellfire missile, hellfire r9x, hellfire missile range, Kabul drone strike, Hellfire Ninja Missile, R9X Hellfire Ninja Missile, Ayman al-Zawahiri, Ayman al-Zawahiri killed, Al-Qaeda Chief Al-Zawahiri, Zawahiri killed by US, Zawahiri killed by CIA drone strike, leader of Al-Qaeda, President Joe Biden, Crime

Al-Qaeda head Ayman al-Zawahiri was killed by two missiles fired by the macabre Hellfire R9X, a warhead-less missile believed to be equipped with six razor-like blades, to kill him. These missiles do not explode but release knife-like blades hitting the targets with precision to avoid collateral damage to civilians. The Hellfire R9X, also called the flying Ginsu, causes no damage to the area as there is no explosive payload that it carries.

హెల్‌ఫైర్ నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్.. ఈ డ్రోన్ దాడితోనే అల్ జవహారీ హతం..

Posted: 08/02/2022 03:31 PM IST
What is hellfire r9x missile secret weapon that killed al qaeda chief al zawahiri

ఆల్‌ఖైదా నేత అయ్‌మన్ అల్‌జవహరిని అమెరికా మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. కాబూల్‌లో అత‌న్ని చంపేశారు. అయితే ఆ ఆప‌రేష‌న్ ఎలా జ‌రిగిందో తెలుసుకుందాం. చాలా సీక్రెట్‌గా అల్‌జ‌వ‌హ‌రిని టార్గెట్ చేసి హ‌త‌మార్చారు. దీని కోసం రెండు డ్రోన్ మిస్సైళ్ల‌ను వాడారు. ఆ మిస్సైళ్లు పేల‌కుండానే టార్గెట్‌ను నాశ‌నం చేశాయి. హెల్‌ఫైర్ నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్‌తో అల్‌జ‌వ‌హ‌రిని హ‌త‌మార్చిన‌ట్లు భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌కు ఆరు రేజ‌ర్ లాంటి బ్లేడ్లు ఉంటాయి. ఇది టార్గెట్‌ను క‌చ్చితంగా చేధిస్తుంది. కానీ ఎక్క‌డా బ్లాస్ట్ జ‌ర‌గ‌దు. నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్ ప్ర‌యోగించిన స‌మ‌యంలో మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గా న‌మోదు కావు.

ఆర్9ఎక్స్ మిస్సైల్‌ను వాడిన‌ట్లు ఎక్క‌డా పెంటగాన్ కానీ సీఐఏ కానీ ఆ స‌మాచారాన్ని వెల్ల‌డించ‌లేదు. కానీ హై ప్రొఫైల్ తీవ్ర‌వాద నేత‌ల్ని టార్గెట్ చేస్తున్న స‌మ‌యంలో ఇలాంటి వెప‌న్స్‌ను వాడుతారు. తొలిసారి 2017 మార్చిలో ఆర్9ఎక్స్ ఆయుధాన్ని వాడారు. సిరియాలో ఓ కారులో ప్ర‌యాణిస్తున్న ఆల్ ఖైయిదా సీనియ‌ర్ నేత అబూ అల్ ఖైర్ అల్ మాస్రిను ఆ మిస్సైల్‌ను ఏసేశారు. ఆర్9ఎక్స్ అత్యాధునిక‌మైంది, చాలా క‌చ్చిత‌త్వంగా టార్గెట్‌ను చేధిస్తుంది. మిస్సైల్‌లో పేలుడు ప‌దార్ధాల‌కు బ‌దులుగా వెడ‌ల్పు ఉన్న బ్లేడ్లు ఉంటాయి. ఒబామా పాల‌న స‌మ‌యంలో దీన్ని డెవ‌ల‌ప్ చేశారు. మిస్సైల్‌కు ఉన్న బ్లేడ్లు.. బిల్డింగ్‌ల‌ను కూడా చొచ్చుకుని వెళ్ల‌గ‌ల‌వు.

డ్రోన్ల ద్వారా హెల్‌ఫైర్ మిస్సైళ్ల‌ను ప్ర‌యోగిస్తారు. వీటినే ఫ్ల‌యింగ్ గిన్సు అని కూడా అంటారు. జ‌పాన్ కిచెన్ క‌త్తుల‌తో వీటిని పోలుస్తారు. అల్యూమినియం క్యాన్ల‌ను ఇవి క‌ట్ చేయ‌గ‌ల‌వు. నింజా బాంబ్ అని కూడా ఈ మిస్సైల్‌ను పిలుస్తుంటారు.  జూలై 31వ తేదీన కాబూల్ ఇంట్లో ఉన్న బాల్క‌నీలో ఒంట‌రిగా నిలుచున్న స‌మ‌యంలో రెండు హెల్‌ఫైర్స్‌తో అటాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అల్‌జ‌వ‌హ‌రి ఉంటున్న బిల్డింగ్‌లో ఒక‌వైపు కిటికీలు ప‌గిలిపోయాయి. మ‌రో వైపు మాత్రం అంతా నార్మ‌ల్‌గా ఉంది. ఈ అటాక్ స‌మ‌యంలో అల్‌జ‌వ‌హ‌రి ఫ్యామిలీ ఇంట్లోనే ఉంది. కానీ ఆ ఫ్యామిలీలో ఎవ‌ర్నీ టార్గెట్ చేయ‌లేద‌ని అధికారులు తెలిపారు.

గిర్ సోమ్ నాథ్ జిల్లాలోని వెరావల్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రప్రజలకు ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఢిల్లీ మోడల్ విద్య, వైద్యం అందిస్తామని ఇంతకు ముందే కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ కు రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పారు. మీకు ఇక్కడి ప్రభుత్వం ఏదైనా ఉచితంగా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మీకు ఏదీ ఉచితంగా ఇవ్వనప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు ఉన్నాయని అడిగారు. కేవలం అవినీతి వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh