Vijayawada Indrakeeladri gears up for Dasara సెప్టెంబర్ 26 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

Vijayawada indrakeeladri kanaka durga temple gears up for dasara

Vijayawada, kanaka durga temple trust board, kanaka durga temple, Indrakeeladri temple authorities, crowd management, collector Dilli Rao, dasara vijayawada, dasara celebrations, NTR district, Andhra pradesh

NTR district administration and Kanaka Durga Temple Trust Board have said that Dasara celebrations will be a grand affair this year. Officials have started work on crowd management as around 6 lakh devotees are expected at the temple this year. Providing darshan and prasadam is a major challenge for temple authorities.

సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

Posted: 08/01/2022 04:27 PM IST
Vijayawada indrakeeladri kanaka durga temple gears up for dasara

విజయవాడలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆశ్వయుజ మాసం సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభం కావడంతో ఆశ్వయుజ శుద్ద పాడ్యమి మొదలుకుని ఆశ్వయుజ దశమి రోజు అక్టోబర్ 5న విజయదశిమి వరకు పది రోజుల పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి ఏకంగా ఆరు లక్షల వరకు భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా నామమాత్రంగానే భక్తులు హాజరుకావడంతో ఈ సారి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని దేవాలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు విఐపీ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని ఆలయానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ దేవాలయ ట్రస్టు బోర్డు సభ్యులతో సమీక్ష నిర్వహించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో అత్యధికంగా వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. చర్యలు తీసుకుని తదనుగూణంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అదేశించారు.

ఇక ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందేట్లు ఏర్పాట్లు చేయాలని ఆయన అదేశించారు. ఇక దసరా సందర్భంగా అమ్మవారు దశ రూపాల్లో భక్తులకు అభయ ప్రధానం చేయనున్న నేపథ్యంలో తదనుగూణంగా అలంకరణ ఏర్పాట్లను కూడా ముందస్తుగానే సమకూర్చుకోవాలని అదేశించారు. సెప్టెంబర్‌ 26న దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత అలంకారంలో, 27న బాలాత్రిపురా సుందరీదేవి, 28న గాయత్రీ దేవి, 29న శ్రీ అన్నపూర్ణదేవి అలంకార రూపంలో దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 30న శ్రీలలితా త్రిపురా సుందరి దేవి, అక్టోబర్‌ 1న శ్రీ మహాలక్ష్మి దేవి, 2న శ్రీ సరస్వతీ దేవి, 3న శ్రీ దుర్గాదేవి, 4న శ్రీమహిషాసుర మర్దని, 5న రాజరాజేశ్వరీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles