Hyderabad: ED raids on casino dealers for FEMA violations ఫెమా ఉల్లంఘనలు.. కాసినో నిర్వహకుల ఇళ్లు సహా 8 చోట్ల ఈడీ సోదాలు

Ed conducts multiple raids in hyderabad at 8 locations including chikoti praveen madhav reddy residences

Enforcement Directorate (ED), ED raids, FEMA violations, ED raids at Chikoti Praveen's residence, IS Sadan, ED raids at Madhav Reddy's residence, Bowenpally, Madhav reddy, Chikoti Praveen, Casino organiser, Agents, Nepal, Bangladesh, Indonesia, Hyderabad, Telangana, Crime

The Enforcement Directorate (ED) conducted multiple raids at 8 locations in Hyderabad, including on Chikoti Praveen's residence in IS Sadan, and Madhav Reddy's house in Bowenpally. Recently, Chikoti Praveen organized a casino in Nepal twice and information was received that several VIPs had attended the event. He, along with a few others, organized casinos for VIPs in Nepal, Bangladesh, and Indonesia which was later noticed by the ED.

ఫెమా ఉల్లంఘనలు.. కాసినో నిర్వహకుల ఇళ్లు సహా 8 చోట్ల ఈడీ సోదాలు

Posted: 07/27/2022 06:32 PM IST
Ed conducts multiple raids in hyderabad at 8 locations including chikoti praveen madhav reddy residences

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. ఇవాళ ఉదయం నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడిన క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్‌, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వీరిద్దరిపై విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి, ఐఎస్‌ సదన్‌లోని చీకొటి ప్రవీణ్‌ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. విదేశాల్లో నిర్వహించిన క్యాసినోలలో వీరు అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది.

వీరు నేపాల్ లో రెండు పర్యాయాలు క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీకి సమాచారం అందింది. దీంతో వీరిపై దృష్టి సారించిన ఈడీకి అంతకుముందు వీరు ఇండోనేషియా, బంగ్లాదేశ్ లలోనూ క్యాసినోలు నిర్వహించారని, అక్కడ విజేతలకు హవాలా రూపంలో ప్రైజ్ మనీ చెల్లించారని కూడా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లను తరలించి.. అటునుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది.

ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు. శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌, నేపాల్‌లో క్యాసినో నిర్వహించి, ప్రైజ్మనీని హవాలా రూపంలో చెల్లించారు. వారంపాటు అక్కడే ఉండి క్యాసినో ఆడేందుకు ఒక్కో కస్టమర్ నుంచి రూ.3 లక్షల రూపాయలు వసూలు చేశారని,నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిఫ్‌లు సైతం అందించారు. నేపాల్‌తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్‌లు నిర్వహించినట్లు తేలింది. దీంతో.. ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసింది ఈడీ. కాగా, గుడివాడతోపాటు హైదరాబాద్‌ క్యాసినో ఆడిస్తూ చికోటి ప్రవీణ్‌ గతంలో పట్టుబడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles