SC upholds power of ED to arrest under PMLA ఈడీకి ఆ అధికారం ఉంది: సుప్రీంకోర్టు

Sc upholds validity of pmla says not mandatory for ed to disclose grounds of arrest

supreme court, PMLA, money laundering law, enforcement directorate, Prevention of Money Laundering Act, Money laundering, standalone offence, PMLA verdict, SC upholds power of ED, ECIR copy accused, ED’s powers to arrest, ED’s powers to summon, ED need not to disclose ground of arrest, Crime

The Supreme Court upheld ED powers of inquiry, arrest, attachment of property today while hearing petitions challenging the constitutionality of several provisions of the Prevention of Money Laundering Act today. Under the stringent PMLA law, the power of arrest, granting bail, seizure of property are all outside the ambit of the Code of Criminal Procedure (CrPC).

‘‘ఈఢీకి ఆ అధికారాలు ఉన్నాయి’’: కేంద్రానికి భారీ ఊరటనిచ్చిన ‘సుప్రీం’

Posted: 07/27/2022 05:30 PM IST
Sc upholds validity of pmla says not mandatory for ed to disclose grounds of arrest

కేంద్ర ప్రభుత్వానికి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. మ‌నీల్యాండరింగ్ చ‌ట్టం కింద అరెస్టు చేసే, స‌మ‌న్లు జారీ చేసే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌కు ఉన్న‌ట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. ఈ చట్టం ప్రకారం పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్‌ వంటి అన్ని చర్యలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

నిధుల మళ్లింపు నిరోధక చ‌ట్టం కింద విచార‌ణ చేప‌ట్టేందుకు, అరెస్టు చేసేందుకు, ప్రాప‌ర్టీని అటాచ్ చేసేందుకు ఈడీకి అన్ని అధికారాలు ఉన్న‌ట్లు అత్యున్నత న్యాయస్థానం త‌న తీర్పులో తెలిపింది. పీఎంఎల్ఏ కింద ఉన్న అన్ని ఈడీ అధికారాల‌ను సుప్రీం స‌మ‌ర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కూడా న్యాయస్థానం కొట్టిపారేసింది. విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలో జస్టిస్ దినేష్ మహేశ్వరీ, జస్టిస్ సి.టి. రవికుమార్ లతో కూడిన త్రిసభ్య ధ‌ర్మాస‌నం ఈ మేరకు తీర్పును వెలవరించింది. ఈడీ, ఎస్ఎఫ్ఐవో, డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ లాంటి ద‌ర్యాప్తు ఏజెన్సీలు పోలీసులు కాదు అని, అందుకే విచార‌ణ స‌మ‌యంలో వాళ్లు సేక‌రించిన ఆధారాలు వాస్త‌వ‌మైన‌వే అని సుప్రీంకోర్టు పేర్కొంది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అరెస్టు చేస్తున్న వ్య‌క్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఈడీ అధికారులు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఈడీ అధికారులు పోలీసులు కాకపోవడం కారణంగా వారు ఎఫ్ఐఆర్ కు బదులుగా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేస్తారని.. అయితే ఈ రెండు వేర్వేరని న్యాయస్థానం పేర్కొన్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  PMLA  money laundering law  enforcement directorate  

Other Articles