School kids massive knowledge about Ramayana, Mahabharata రామయణ, మహాభారతలపై ఈ చిన్నారులకు మంచి పట్టు.!

School kids leave netizens shocked with their massive knowledge about ramayana mahabharata

Viral Video, indian viral video, new viral video, desi viral video, viral videos, viral video link, School kids video, Ramayana, Mahabharata, ramayana kid, mahabharata epic,social media, Byomkesh, twitter, school videos, trending news

Viral video of two school kids answering questions related to the epics Ramayana and Mahabharata has taken internet users by surprise. The young students are able to answer the most difficult questions without pausing even for a minute. The video which is being extensively reshared on social media platforms was shared by Twitter user Byomkesh and has garnered 96.2K views.

ITEMVIDEOS: లవకుశలే మళ్లీ పుట్టారా.? రామయణ, మహాభారతలపై ఈ చిన్నారులకు మంచి పట్టు.!

Posted: 07/26/2022 07:31 PM IST
School kids leave netizens shocked with their massive knowledge about ramayana mahabharata

శ్రీమద్రామాయణం యావత్తు శ్రీరాములవారి చుట్టూనే తిరగడం మనకు తెలిసిందే. అయినా.. శ్రీరాముల వారి తనయులు లవకుశలు అని.. అశ్వమేధయాగం చేసిన నేపథ్యంలో వారు శ్రీరాములవారు వదిలిన అశ్వాన్ని కట్టివేసి.. స్వయంగా రాములవారితో యుద్దానికి సై అంటారని.. ఈ యుద్దంలో లక్ష్మణాదులను సైతం వారు ఓడించి.. పైచేయి సాధిస్తారన్న విషయం తెలిసిందే. లవకుశలతో తలపడేందుకు స్వయంగా శ్రీరాములవారు విచ్చేసి.. సీతను గుర్తించడం.. సీతమ్మ తన తల్లి భూమాతలో ఐక్యం కావడం మనకు తెలిసిన.. సినిమా నాలెజ్జి. ఇలా మొత్తానికి శ్రీరాముల వారిచెంతకు చేరిన లవకుశలు రాజ్యపాలన చేస్తారు.

అయితే సీత జాడ కోసం శ్రీరాములవారు లక్ష్మణ సమేతంగా అన్వేషిస్తున్న క్రమంలో ఆయనకు ఎవరుఎవరు మార్గనిర్ధేశనం చేశారు అంటే చెప్పడం కాసింత కష్టమే. కానీ ఈ ఇద్దరు కుర్రాళ్లు మాత్రం.. శ్రీరాముల వారి రామాయణంతో పాటు మహాభారతంలోని పలు ఘట్టాలపై సంపూర్ణ అవగాహణ ఉన్నవారిలా.. గుక్కతిప్పుకోకుండా ఠకీఠకీమని అన్నింటికీ సమాధానం చెబుతున్నారు. అచ్చంగా అప్పటి లవకుశలే మళ్లీ ఇప్పుడు జనియించారా.? అన్నట్టుగా వీరి ప్రతిభ అందరినీ అశ్చర్యచకితులను చేస్తోంది. వీరి ప్రతిభతో మహా మహా మేధావులే విస్మయానికి గురవుతున్నారు.

ఇక వీరి ప్రతిభ ధాటి ఎంతలా ఉందంటే.. నెట్టింట ఈ వీడియోను అప్ లోడ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నెట్ జనులు ఆశ్చర్యచకితులై.. షేర్లు, లైకులతో అప్రతిహాతంగా దూసుకుపోతోంది. ప్ర‌త్యేక నైపుణ్యాలుగ‌ల వ్యక్తుల వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే ప్ర‌స్తుతం ఈఇద్దరు చిన్నారుల వీడియో ఆన్‌లైన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఇద్ద‌రు విద్యార్థులు భార‌త ఇతిహాసాలైన రామాయ‌ణం, మ‌హాభార‌తంలోని క‌ఠిన ప్ర‌శ్న‌ల‌కు గుక్క‌తిప్పుకోకుండా స‌మాధాన‌మిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు వారిని ప్ర‌శంసిస్తున్నారు. ఈ వీడియోను ‘బ్యోమకేశ్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్‌చేశాడు.

ఈ వీడియోలో ఒక వ్య‌క్తి స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థుల‌ను చాలా కష్టమైన ప్రశ్నలను అడిగాడు. వారిద్దరూ ఒక్క క్షణం కూడా ఆగిపోకుండా వాటికి సమాధానాలు ఇచ్చారు. అత‌డు మొద‌టి విద్యార్థిని పాండవ సోదరులు, ద్రోణాచార్య కుమారుడు, అర్జునుడి గురువు, మహాభారతానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇంకో విద్యార్థిని రామాయణం గురించి ప్రశ్నలు అడిగాడు. వారిద్ద‌రూ వాటికి త‌డ‌బ‌డ‌కుండా సమాధానం చెప్పారు. ఈ వీడియోను ప్ర‌శ్న‌లు అడిగిన వ్య‌క్తి ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. ‘ఇది స్కూల్ అంటే.. మీ పిల్ల‌ల‌ను ఇక్క‌డే చేర్పించండి’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లంద‌రూ ఆ పిల్ల‌ల‌ను మెచ్చుకున్నారు. ఉత్త‌మ‌ జ్ఞానాన్ని అందించినందుకు పాఠశాల ఉపాధ్యాయుల‌ను అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles