Crew member finds snake head served in an in-flight meal నెట్టింట్లో వైరల్ అవుతున్న పాము తల వీడియో.. ఎందులో ఉందంటే..!

Flight attendant finds severed snake head in airline meal catering suspended

snake inside meal in plane, snake head in meal, snake in plane meal, snake head in flight meal, snake head in crew member meal, severed snake head, inflight meal, turkish flight, SunExpress flight, cabin crew, flight attendant, reptile head, Viral video, video viral

Spotting a snake anywhere can be a nightmare. And, finding a snake on your plate while eating a meal on a flight can be the worst nightmare. A crew member claimed that they found the snake’s head in the meal served onboard a flight from Ankara to Düsseldorf last week, according to the aviation blog One Meal At A Time. A video of the meal with the snake’s body part was shared on social media.

ITEMVIDEOS: నెట్టింట్లో వైరల్ అవుతున్న పాము తల వీడియో.. ఎందులో ఉందంటే..!

Posted: 07/26/2022 06:19 PM IST
Flight attendant finds severed snake head in airline meal catering suspended

కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఈ క్రమంలో అదే బోజనం కలుషితమైతే.. ఆ అనుభవం కడు దయనీయం. కడుపులో ఆకలి నకనకలాడుతుంటే.. ఏదో ఒకటి తినాలని అందరూ అనుకుంటారు. తీరా ఇలా వచ్చిన బోజనంలో దాదాపుగా మూడోంతుల భోజనం చేసిన తరువాత అందులో విషతుల్యమైందని తెలిస్తేనే.. తిన్న ఆహారాన్ని బయటకు కక్కేసి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తాం. అయితే ఇది ప్రమాదకరమే అయినా.. ఆ పరిస్థితుల్లో తప్పదు. అలాంటిది అన్నంలో ఏకంగా పాము తల కనిపిస్తే.. దానిని తిన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు.

అదృష్టం కొద్ది దానిని తిన్న వ్యక్తికి ఏమీ కాలేదు. ఒళ్లు గ‌గుర్పొడిచే సంఘ‌ట‌న‌ జరిగింది ఓ ప్రముఖ విమానయాన సంస్థ అందించే బోజనంలో అని తెలిస్తే.. మీరెలా ఫీలవుతారు.. వెంటనే ఫ్లైయిట్ సిబ్బందితో గొడవకు దిగడం ఖాయం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకునేందుకు అసలేం జరిగిందన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. టర్కీకి చెందిన విమానయాన సంస్థ ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలో భోజనం చేస్తుండ‌గా పాము తల క‌నిపించింది. భోజ‌నం సగం పూర్తి చేశాక పాము త‌ల‌ను చూసిన అటెండెంట్ భ‌య‌ప‌డిపోయాడు. ఒక్క‌సారిగా గ‌ట్టిగా అరిచాడు. అనంతరం ఈ ఘ‌ట‌న‌పై అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

జూలై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న స‌న్ ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జ‌రిగింది. క్యాబిన్ సిబ్బంది భోజ‌నం చేస్తున్నారు. ఒక అటెండెంట్ భోజ‌నం స‌గం పూర్తిచేశాక బంగాళ‌దుంప‌లు, కూర‌గాయ‌ల మ‌ధ్య తెగిప‌డిన పాము త‌ల క‌నిపించింది. ట్విటర్‌లో షేర్ చేసిన ఫుడ్ ట్రే మధ్యలో పాము త‌ల స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. కాగా, ఈ ఘ‌ట‌న‌పై విమాన‌యాన సంస్థ స్పందించింది. ఇది పూర్తిగా ఆమోద‌యోగ్యం కాద‌ని తెలిపింది. ఆహారం స‌ర‌ఫ‌రా చేపే క్యాటరింగ్ సంస్థ‌తో ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles