"Give Bail To Undertrials, Or We Will": SC To UP High Court భిన్నంగా ఆలోచించాలి.. సెలవు దినాల్లోనూ పని చేయాలి..!

Give bail to undertrials or we will do it supreme court to allahabad high court

Supreme Court fires on Allahabad High Court, supreme court bench on UP High Court, Supreme Court on Uttat pradesh undertrails, SC on Allahabad High Court, SC on uttar pradesh undertrials, Supreme Court on Uttar Pradesh Government, High Court, UP High Court, Supreme Court, SC, Allahabad High Court, undertrials, Uttar Pradesh High Court, Uttar Pradesh, Uttar Pradesh, Crime

Warning of a blanket bail order, the Supreme Court has pulled up the Uttar Pradesh government for not taking steps to release undertrial prisoners jailed for more than 10 years despite a top court order. The court also came down strongly on the Allahabad High Court for not deciding the bail petitions expeditiously. The bench of Justices SK Kaul and MM Sundresh said the state government and the high court were "not being sensitive" and added that it was prepared to "take the burden" and decide the cases by itself. The court warned that it "will pass a blanket order granting bail".

‘అండర్ ట్రయల్స్ కు బెయిల్ ఇస్తారా.. మమల్నే ఇవ్వమంటారా’: హైకోర్టును తలంటిన ‘‘సుప్రీం’’

Posted: 07/26/2022 12:59 PM IST
Give bail to undertrials or we will do it supreme court to allahabad high court

నేరం చేశారన్న అభియోగాలు నిరూపితం కాకుండా ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల బెయిల్ పిటిషన్ల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులలో తమకు బెయిల్ మంజూరు చేయాలని అనేకమంది పెట్టుకున్న బెయిల్ పిటీషన్ల విచారణలో జరుగుతున్న సుదీర్ఘజాప్యంపై అలహాబాద్ హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోర్టు మందలించింది. బెయిల్ కోసం దాఖలైన పిటీషన్ల విచారణను వేగంగా పరిష్కరించేందుకు భిన్నంగా ఆలోచించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

కేసుల సత్వర పరిష్కారానికి సెలవు దినాల్లోనూ పని చేయాలని సూచించింది. హైకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టుకు ఆయా విషయాలను నిర్వహించడం కష్టంగా అనిపిస్తే.. వాటిని తమకు సిఫారసు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదనపు భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నామని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 853 క్రిమిన్‌ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్న ధర్మాసనం ఆయా పిటిషనర్లు పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారని, వ్యక్తి స్వేచ్ఛతో రాజీపడుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఆగస్ట్‌ 17న విచారించనున్నది.

ఇదే సమయంలో 853 కేసుల జాబితాను సమర్పించాలని ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో దోషిగా తేలిన ఖైదీ నిర్బంధకాలానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని, ఈ కేసుల్లో ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంత మందికి బెయిల్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది? అనే వివరాలు సమర్పించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి రెండువారాల సమయం ఇచ్చింది. 15 సంవత్సరాలు పైబడిన, 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఖైదీలకు సంబంధించి హైకోర్టు సీనియర్ రిజిస్ట్రార్ దాఖలు చేసిన నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది.

62 బెయిల్ పిటిషన్లను ఇంకా పరిష్కరించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి జూలై 17 వరకు 232 కొత్త బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. మరో వైపు పిల్లలు కనేందుకు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేస్తూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్‌ను వచ్చేవారం లిస్ట్‌ చేయాలని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది. రాజస్థాన్‌ హైకోర్టు నిర్ణయం తర్వాత బెయిల్‌ కోరుతున్న వారి సంఖ్య పెరిగిందని ఓ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles