A wild elephant overturned a lorry and tasted sugarcane రహదారిపై మాల్ గాఢిని అడ్డుకున్న గజరాజు.. ఏం చేసిందంటే..!

A wild elephant overturned a lorry and tasted sugarcane terrified motorists

wild elephants lorry loaded with sugarcane, sugarcane truck national highway, sugar cane Talavadi hills, Sathyamangalam-Mysore National Highway, Sathyamangalam, National Highway, overturned lorry, Asanoor forest, Erode district, Tamil Nadu, Viral

Motorists were terrorized by wild elephants that overturned a sugarcane truck on the National Highway and crushed the sugarcane pieces. A large amount of sugarcane is cultivated in the Talavadi hills near Sathyamangalam in Erode district. The sugarcane grown here is harvested and transported to the private sugar factory in Sathyamangalam by trucks. In this situation, a lorry loaded with sugarcane from Thalavadi was going to Sathyamangalam near Asanur on the Sathyamangalam-Mysore National Highway. Then a wild elephant came out of the Asanoor forest and overtook the truck carrying sugarcane, so the driver got scared and stopped the truck in the middle of the road.

ITEMVIDEOS: గజరాజు దాదాగిరి: రహదారిపై మాల్ గాఢిని అడ్డుకున్న ఏనుగు..!

Posted: 07/23/2022 05:05 PM IST
A wild elephant overturned a lorry and tasted sugarcane terrified motorists

నానాటికీ దేశంలో ప్రజల సంఖ్య పెరుగుతోంది. అరణ్యాలను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకునే స్థాయికి వెళ్లడంతో.. అడవుల్లో ఉన్న వన్యమృగాలు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అటవీప్రాంతాలకు శివార్లలో ఉన్న గ్రామాలపై విరుచుకుపడి అక్కడి పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక తమ ప్రాణాలకు కూడా ఎక్కడ హాని కలుగుతుందోనని గ్రామ ప్రజలు కూడా కంటిమీద కునుకు కరువవుతోంది. అయితే ఏనుగులు, అడవి పందుల నుంచి అధిక నష్టాన్ని ఎదుర్కోంటున్న రైతులు.. అవి తమ పంటలపై దాడి చేయకుండా రక్షణ చర్యలకు పూనుకుంటున్నారు.

దీంతో అటు అడవుల్లో ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే వన్యమృగాలు ఆహారాన్ని వెతుక్కుంటూ.. జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఓ గజరాజు మాత్రం తనకు తాను ఎప్పుడు చూసిందో తెలియదు కానీ ఓ రహదారిని టార్గెట్ గా చేసుకుని ఆ మార్గంలోనే తిష్టవేసింది. అక్కడి నుంచి వెళ్తున్న భారీ వాహనాలైన మాల్ గాఢీలపై నజర్ వేసింది. అప్పట్లో ఓ నాలుగు ఏనుగులు కలసి లారీల్లోంచి చెరుకు గడలను తీసుకుని తినేశాయి. ఇలా కొంత చెరుకును అవి తిన్న తరువాత లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడి నుంచి తన గమ్యస్థానానికి తరలించాడు.

ఆ విషయం గుర్తుందో లేక అలాగే మరో లారీ వస్తుందనుకునే ఓ గజరాజు మాత్రం చెరుకు లోడ్డును తీసుకువెళ్లే లారీల కోసం అదే రహదారిపై కాపుకాసింది. ఆ లారీ రాగానే దానికి అడ్డుగా వెళ్లి లారీ పై నుంచి చెరుకు గడలను తన తొండంతో తీసుకుని తినింది. ఇక చాలు జరగవే అన్నట్లుగా లారీ డ్రైవర్ హారన్ కోట్టినా అది ఏ మాత్రం కదలకుండా చెరుకు గడలను తింటూ కొద్ది సేపు ఆస్వాదించింది. ఈ ఘటన తమిళనాడు ఈరోడ్​లో జరిగింది. చెరకు లోడ్​తో వెళ్తున్న ఓ ట్రక్కును ఆపిన ఏనుగు. ఏంచక్కా.. చెరకు గడలను తీసుకుంటూ తినసాగింది.

డ్రైవర్​ భయంతో.. బయటకు రాకుండా వాహనాన్ని అలాగే ఉండనిచ్చాడు. కొద్ది సమయం తరువాత ఏనుగును తప్పుకునేలా గట్టిగా హారన్ మ్రోగించాడు. అయినా ఏనుగు మాత్రం తనకు కావాల్సినన్ని చెరుకు గడలు తినేవరకు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో అసనూర్​ సమీపంలోని సత్యమంగళం- మైసూర్​ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఏనుగు కదిలేంత వరకు వాహనాలు ఏమీ వెళ్లనీయకుండా రహదారికి ఇరువైపులా కాపలాగా ఉన్నారు. ఏనుగు కాసేపటికి కదలి అడవిలోకి తిరిగివెళ్లింది. జులై 21న జరిగిన ఈ ఘటన సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles