Telangana: Officials put on high alert over rain forecast రాబోయే 3 రోజుల్లో అతి భారీ వ‌ర్షాలు : వాతావ‌ర‌ణ శాఖ‌

Telangana very heavy rainfall likely in these districts check details here

IMD, KCR, Rains, Somesh Kumar, Red Alert, Districts, Rain Alert, Heavy rainfall, Telangana, Telangana news

As heavy rains are forecast in Telangana over the next two days, chief secretary Somesh Kumar has asked officials to be on high alert. Kumar stressed preventing loss of life due to rains, as chief minister K Chandrashekhar Rao directed him to take stalk of the preparations to tackle the challenges posed by rains. In wake of floods and due to the rising danger levels of the Godavari river, the government is planning to strengthen its response to such situations in the future.

రాబోయే 3 రోజుల్లో అతి భారీ వ‌ర్షాలు : వాతావ‌ర‌ణ శాఖ‌

Posted: 07/23/2022 03:45 PM IST
Telangana very heavy rainfall likely in these districts check details here

తెలంగాణ వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. రాబోయే 3 రోజుల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో ఈశాన్య‌, ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాగ‌ల 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో రాగ‌ల 3 రోజులు అతి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. మోస్త‌రు నుంచి గ‌ట్టి జ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధికంగా న‌మోదు అయింద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  KCR  Rains  Somesh Kumar  Red Alert  Districts  Rain Alert  Heavy rainfall  Telangana  Telangana news  

Other Articles