High Court Key Decision in Minister Kakani Case మంత్రి నిందితుడిగా ఉన్న కేసును సీబిఐకి ఎందుకు అప్పగించరాదు: హైకోర్టు

Ap high court reserves final verdict on handovering the investigation to cbi in minister accused case

court documents theft case, 4th additional junior civil judge court, Minister Kakani Govardhan Reddy, TDP Leader, Somireddy chandramohan reddy, nellore district court, Andhra Pradesh High court, CBI, Investigation, Andhra Pradesh, politics, crime

The Nellore district documents theft case which caused political upheaval in AP has been handed over to the CBI. The case was heard in the AP High Court. The Advocate General appearing on behalf of the state government told the court that they have no objection if the case is handed over to the CBI for investigation. With this, the High Court said that appropriate orders will be given on the matter of handing over the case to the CBI.

మంత్రి నిందితుడిగా ఉన్న కేసును సీబిఐకి ఎందుకు అప్పగించరాదు: హైకోర్టు

Posted: 07/20/2022 12:43 PM IST
Ap high court reserves final verdict on handovering the investigation to cbi in minister accused case

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేలకోట్ల రూపాయల ఆస్తులున్నాయని 2017లో ఆరోపించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి.. అందుకు ఆధారాలున్నాయని పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలని... ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ప్రాపర్టీ నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి మే 13వ తేదీ రాత్రి దొంగతనానికి గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు... మంత్రి కాకాణితో పాటు మొత్తం 18 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై నెల్లూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఏపీలోని నెల్లూరు జిల్లాకేంద్రంలోని 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దొంగలు పడ్డారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్​ స్థానిక చిన్నబజారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఏప్రిల్​13వ తేదీ అర్ధరాత్రి కొందరు అగంతకులు చొరబడి.. కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles