KTR takes on PM Modi on Twitter yet again పాలు, ఉత్పత్తులపై జీఎస్టీ.. ఈ ప్రధానిని ఏమని పిలవాలి: కేటీఆర్

Telangana minister ktr takes on pm narendra modi on twitter yet again

KTR, Narendra Modi, BJP government, Farmers, Milk, Milk products, China second village, 56 inches chest, VishwaGuru, Achhe Din, BJP Rule, PM Modi rule, protest against Gst on Milk products, Telangana, National Politics

The State MA&UD Minister K Taraka Rama Rao has never left any stone unturned to question the BJP-led Central government or the Narendra Modi government to question on what is going on in the country. On Wednesday, KTR took to his Twitter and asked the netizens, "what to call a PM who can neither control inflation nor infiltration into the country?'

చరిత్రలో తొలిసారి పాలు, ఉత్పత్తులపై జీఎస్టీ.. ఈ ప్రధానిని ఏమని పిలవాలి: కేటీఆర్

Posted: 07/20/2022 11:49 AM IST
Telangana minister ktr takes on pm narendra modi on twitter yet again

పాలు, పెరుగు సహా పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్ను విధించటాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నిరసనల బాట పట్టింది. నూతన సాగు చట్టాలను రైతుల ఏడాదికిపైగా నిరసన దీక్ష కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్న కేంద్రం.. వారిపై మరో విధంగా కక్షసాదింపు చర్యలు తీసుకుంటుందా.? అంటే ఔననే అంటున్నారు  టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు తెలపడానికి పూనుకోవాలని అన్నారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాలు, పాల ఉత్పత్తులపైన కేంద్రం మొదటిసారి జీఎస్టీ విధించిందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ నిర్ణయంపై పార్టీశ్రేణులు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడంపట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్నిజిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా పాడి రైతులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేక పోతున్నారని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని.. శాటిలైట్ ఫొటోలతో మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ పోస్ట్ చేశారు. దేశాన్ని కాపాడుకోలేని ప్రధానిని ఏమని పిలవాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రిని ఏమని పిలవాలో చెప్పాలని కోరుతూ నాలుగు ఆప్షన్లను ట్వీట్ చేశారు. ఎ. 56” బి. విశ్వగురు సి. అచ్చేదిన్‌ వాలే డి. పైన పేర్కొన్నవన్నీ అన్‌పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles