Gold coins found during excavation in UP's Jaunpur బాత్రూమ్ గుంతలో బంగారు నాణేలు.. పోలీసులు పట్టుకెళ్లి..

Gold coins found during excavation in uttar pradesh s jaunpur

Gold coins, copper vessel, bathroom, toilet pit, excavation, British empire era, Noor Jahan, Imam Ali Raini, labourers quarrell, Kotwali area, Jaunpur district, Uttar Pradesh, UP Police, Crime

Gold coins from the British empire era have been found in Jaunpur district of Uttar Pradesh during digging of a toilet pit inside the house of a woman in Kotwali area of the district, police said. The family members of the woman Noor Jahan and labourers did not let anyone know about this incident that took place last week.All coins belong to the British empire (between 1889-1912). Noor Jahan, wife of Imam Ali Raini, was getting a pit dug for the construction of a toilet in her house. During the digging, some coins were found in a copper vessel, after which the labourers started quarrelling among themselves.

బాత్రూమ్ గుంతలో బంగారు నిధి.. పోలీసులు పట్టుకెళ్లి..

Posted: 07/19/2022 07:36 PM IST
Gold coins found during excavation in uttar pradesh s jaunpur

లక్కు తలుపుతట్టిన సమయంలో దానిని అందుకోవాలని ప్రతీ ఒక్కరూ అలోచిస్తారు. అయితే అది సక్రమంగా అందుకుంటే.. సమస్యే లేదు. కానీ అక్రమంగా సొంతం చేసుకోవాలంటే మాత్రం కష్టాలను కొని తెచ్చుకోవడమే కాదు.. విషయం పెద్దదై ఊరందరిలో తలవంపులు కూడా ఎదుర్కోన్నాల్సి వస్తుంది. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఓ ఇంట్లో పురాతనకాలం నాటి బంగారు నాణేలు వెలుగుచూశాయి. అయితే వాటి కోసం కూలీలు, ఇంటి యజమానులకు మధ్య బేధాభిప్రాయాలు రావడంతో విషయం బయటకు పోకింది. ఈ సమాచారం ఆ నోటా, ఈనోటా పోలీసులకు చేరింది.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లోని జౌన్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. నూర్జహాన్ ఫ్యామిలీ తమ ఇంట్లో బాత్రూం కట్టాలని ప్లాన్​ చేసింది. దీనికోసం తవ్వకాలు చేపట్టగా కళ్లు చెదిరిపోయేలా బంగారు నాణేలు బయటపడ్డాయి. కూలీలు తవ్విన గుంతలో ముందుగా ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అన్నీ పసిడి నాణేలు కనిపించాయి. అయితే.. వాటిని సొమ్ముచేసుకోవాలని ఆశించిన నూర్జహాన్ కుటుంబానికి పోలీసులు అడ్డుతగిలారు. బంగారు నాణేలు లభ్యమైన విషయాన్ని నూర్జహాన్ కుటుంబీకులు ఎంత గోప్యంగా ఉంచుదామని అనుకున్నా అది బట్టబయలైంది.

రాగిపాత్రను వెలికి తీసిన కూలీలకు, నూర్జహాన్ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు నూర్జహాన్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో కూలీలు పని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. వారు తిరిగి మరుసటి రోజు రాగా నూర్జహాన్ కుటుంబం వారికి ఓ బంగారు నాణెం ఇచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అవి బ్రిటీష్ పాలన నాటివని గుర్తించారు. 1889-1920 మధ్య కాలం నాటివని వెల్లడైంది. కాగా, పోలీసులకు భయపడి కొందరు కూలీలు పరారీలో ఉన్నట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles