TTD to release Angapradakshinam tokens of August శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆన్ లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లు..

Ttd to release angapradakshinam tokens of august month tomorrow

The Tirumala Tirupati Devasthanam has announced that Angapradakshinam tokens will be released online on 20th July for August. Angapradakshinam tokens are allotted at the rate of 750 each on other days of the week except Friday. Angapradakshinam tokens were stopped in Tirumala for two years due to Corona. These tokens are being issued again from April this year due to the decline in Covid cases, TTD, Angapradakshinam tokens, Tirumala, Tirumala Tirupati Devasthanam, YV Subba Reddy, Andhra Pradesh, devotional.

The Tirumala Tirupati Devasthanam has announced that Angapradakshinam tokens will be released online on 20th July for August. Angapradakshinam tokens are allotted at the rate of 750 each on other days of the week except Friday. Angapradakshinam tokens were stopped in Tirumala for two years due to Corona. These tokens are being issued again from April this year due to the decline in Covid cases.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆన్ లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లు.. రేపే విడుదల

Posted: 07/19/2022 06:44 PM IST
Ttd to release angapradakshinam tokens of august month tomorrow

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఇల వైకుంఠంలా బాసిల్లుతున్న శ్రీవారి దర్శనం ఎప్పుడెప్పుడు మునపటిలా అవుతుందా.? అంటూ భక్తజనకోటి వేయికళ్లతో నిరీక్షించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి స్వామివారి దర్శనాలను యధవిధిగా మార్చేందుకు చర్యలు చేపట్టిన టీటీడీ.. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చర్యలు చేపట్టింది. ఇక ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఏరోజుకారోజు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వస్తునే ఉన్నారు.

ఈ తరుణంలో ఇప్పటివరకు కొంతమంది భక్తులకే తెలిసిన సేవలను కూడా భక్తులందరూ పాల్గోనే అవకాశాన్ని కల్పించనుంది. భక్తులందరికీ అందుబాటులోకి మరో విధమైన దర్శనబాగ్యం కల్పించే అవకాశాన్ని తీసుకురానుంది. అయితే ఈ టికెట్ దర్శనానికే కాదు.. స్వామివారి సన్నిదిలో ఆనందనిలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భాగ్యం కలిగిస్తోంది. ఆగస్ట్‌కు సంబంధించిన అంగప్రక్షిణం టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయించనున్నది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.

అంగప్రదక్షిణం అంటే ఏంటీ?

అంగప్రదక్షిణం అంటే స్వామివారి ఆనందనిలయం చుట్టూ ప్రదక్షిణం చేసి.. స్వామివారిని దర్శించుకునే అవకాశం. ఈ అవకాశం కోసం ఎంతోమంది వేచిచూస్తుంటారు. అయితే వారికి ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఎక్కడ విక్రయిస్తారన్న విషయాలు తెలియవు. దీంతో తాజాగా టీటీడీ వీటిని కూడా అన్ లైన్లో విడుదల చేస్తోంది. అంగప్రదక్షిణం స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది. దీంతో భక్తిభావంతో భక్తులు స్వామివారి కటాక్షం కోసం పొర్లుదండాలు పెడుతుంటారు. అంగప్రదక్షిణం టోకెన్లు ఉన్న భక్తులు ప్రతిరోజు వేకువజామున ముందుగా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వెండి వాలికిలో నుంచి బంగారు వాకిలికి చేరుకుంటారు.

వెండి వాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణనే అంగప్రదక్షిణంగా పిలుస్తుంటారు. ఓ వైపు సుప్రభాత సేవ జరిగే సమయంలోనే టీటీడీ భక్తులకు అంగప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తుంది. భక్తులు వెండి వాకిలి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపై శ్రీరంగనాథుడు కొలువై కనిపిస్తాడు. ఆయనకుపైన వరదరాజ స్వామి, కింద వేంకటేశ్వరస్వామి చిత్రాలు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి. ఇక్కడి నుంచి అంగప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆనంద నిలయం చుట్టూ ఒకసారి అంగప్రదక్షిణం చేసిన తర్వాత భక్తులకు టీటీడీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles