BJP retains 7 posts of mayors, Congress bags 3 in Madhya Pradesh మధ్యప్రదేశ్ లో పుంజుకున్న కాంగ్రెస్.. బోణి కొట్టిన అప్, ఎంఐఎం

Mp local body elections 2022 bjp retains 7 posts of mayors congress bags 3

Local Body ELection Results 2022, MP Local Body Poll Results, MP Local Body election 2022 winners, municipal corporations, Nagar palikas, Balaghat Zila Panchayat Results, BJP, Shivraj Singh Chouhan, Congress, Kamal Nath, AAP, Arvind Kejriwal, Madhya Pradesh, Politics

Out of 11 municipal corporations, BJP has won seven seats, Congress three, while the third entrant, AAP, bagged the mayoral post in Singrauli. However, BJP lost key mayoral posts in Gwalior, Jabalpur, Chhindwara and Singrauli to opposition Congress and AAP. The BJP has won the post of mayor in six municipal corporations- Burhanpur, Satna, Khandwa, Sagar, Indore, Ujjain, and Bhopal, while the Congress in Chhindwara, Gwalior and Jabalpur and the AAP in Singrauli. In 36 nagar palikas, the BJP has won 27, Congress four and Independents five.

మధ్యప్రదేశ్ ‘స్థానిక’ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్.. బోణి కొట్టిన అప్, ఎంఐఎం

Posted: 07/19/2022 12:47 PM IST
Mp local body elections 2022 bjp retains 7 posts of mayors congress bags 3

మధ్యప్రదేశ్‌లో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అధికార బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లోట్టబోయిందన్న చందంగా మారింది. రాష్ట్రంలో సంపూర్ణ స్థాయిలో మెజారిటీని గతంలో నిలుపుకున్న కాషాయపార్టీ.. ఈ సారి ఎన్నికలలో నాలుగు స్థానాలను ప్రతిపక్ష పార్టీలకు చేజార్చింది. అయితే ప్రస్తుతానికి బీజేపియే అధిక స్థానాలను కైవసం చేసుకున్నా.. పార్టీలో మాత్రం అంతర్మధనం కొనసాగుతోంది. ఈ ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఊరటనివ్వగా.. పంజాబ్ లో విజయదుఃధుభి మ్రోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మధ్యప్రదేశ్ ఎన్నికలలో బోణి కొట్టింది.

రాష్ట్రంలోని మొత్తం 16 నగర పాలక సంస్థలకు తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో 11 కార్పొరేషన్లకు గాను ఏడింటిని మాత్రమే బీజేపీ నిలబెట్టుకోగలిగింది. కాగా బీజేపి అధిపత్యానికి చెక్ పెట్టిన కాంగ్రెస్ మూడింటిని హస్తగతం చేసుకోగా, అమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక కార్పోరేషన్ ను దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు కేవలం తెలంగాణ, మహారాష్ట్ర సహా కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. మధ్యప్రదేశ్‌లో బోణి కోట్టింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటరైన అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం కూడా కార్పోరేషన్ ఎన్నికలలో నాలుగు కార్పరేటర్ సీట్లలను దక్కించుకుంది. జబల్‌పూర్, బుర్హాన్‌పూర్, ఖండ్వాలలో మొత్తం నాలుగు కార్పొరేటర్ స్థానాలను చేజిక్కించుకుంది.

గతంలో ఈ 16 కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకోగా ఇప్పుడు వాటిలో సగం స్థానాలను కోల్పోయింది. ఇక రాష్ట్రంలో జరిగిన 36 నగర పాలికల ఎన్నికలలో బీజేపి తన అధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ నాలుగు స్థానాలను స్వతంత్రులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక బాలఘాట్ జిల్లా పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్.. అధికార బీజేపిపై తన సత్తాను చాటింది. మొత్తం 27 స్థానాల్లో కాంగ్రెస్ 14, బీజేపి 06, స్వతంత్రులు 06, జిజిపి 01 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. తాజా ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles