Women Give Mud Bath To BJP MLA In Uttar Pradesh బీజేపీ ఎమ్మెల్యేపై బురద చల్లిన మహిళలు… ఎందుకంటే?

Watch women give mud bath to bjp mla in uttar pradesh s maharajganj

Jaimangal Kanojia, BJP MLA mud bath video, Women Give Mud Bath To BJP MLA, MLA Jaimangal Kanojiya, Maharajganj, mud bath, Pipardeura area, Maharajganj, Krishna Gopal Jaiswal, Uttar Pradesh, uttar pradesh news, Viral video

A group of women reportedly soaked BJP MLA Jaimangal Kanojia in mud in Uttar Pradesh’s Maharajganj. Amid scorching heat, the women reportedly gave a mud bath to the BJP MLA as part of a ritual to please rain god. The women of Pipardeura area in Maharajganj also sang while giving a mud bath to MLA Jaimangal Kanojiya and also Nagar Palika chairman Krishna Gopal Jaiswal.

ITEMVIDEOS: బీజేపీ ఎమ్మెల్యేపై బురద చల్లిన మహిళలు… ఎందుకంటే?

Posted: 07/14/2022 06:26 PM IST
Watch women give mud bath to bjp mla in uttar pradesh s maharajganj

బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళలు బురద చల్లారు. అదేంటీ ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక ప్రజల బలంతో గెలిచిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపి ఎమ్మెల్యేకు అంతలోనే ఇంతటి వ్యతిరేకమా.? అని అనుకుంటున్నారా..? అయితే మీరూ బురదలో కాలేసినట్లే. మరైతే ఎమ్మెల్యేపై మహిళలు బురదజల్లడం దేనికి.? అంటరా.? అదే అక్కడి ఆనవాయితీ. అదే అనవాయితీ అంటే.. వర్షాలు పడాలంటే ఇలా చేయడం అక్కడి ప్రజల అనవాయితీ. దీంతో బకెట్లతో బురద నీళ్లను తలపై గుమ్మరించారు.

బురద నీళ్లతో తల స్నానం చేయించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపర్‌డ్యూరా ప్రాంతానికి చెందిన మహిళలు వాన దేవుడి ప్రసన్నం కోసం పురాతన ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా స్థానిక పాలకులకు బురద నీళ్లతో తల స్నానం చేయించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ ప్రాంత మహిళలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్‌ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌ల తలపై బురద నీళ్లు గుమ్మరించి మట్టి స్నానం చేయించారు.

ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ పాటలు పాడారు. కాగా, పిల్లలు, పెద్దలు బురద నీటితో తల స్నానం చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత మహిళల నమ్మకమని బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్‌ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌ తెలిపారు. పురాతన సంప్రదాయమైన ఈ బురద స్నానంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles