Man who sneaked into Mamata Banerjee's house carried iron rod దీదీ నివాసంలోకి ప్ర‌వేశించిన వ్య‌క్తి గురించి వెల్ల‌డైన షాకింగ్ వివ‌రాలు

Intruder hafizul who barged into the house of mamata banerjee has bangladeshi links

west bengal CM, bengal chief minister, mamata benerjee, Intruder Hafizul, Bangladeshi links, West Bengal, Politics

An iron rod was found in the possession of the man who was arrested for sneaking past three-tier security arrangements and had entered the residential premises of West Bengal Chief Minister Mamata Banerjee unnoticed. The accused, identified as Hafizul Mollah, had breached the security of the Bengal CM, had an iron rod with him when he was arrested on July 3 from the premises of the CM.

దీదీ నివాసంలోకి ప్ర‌వేశించిన వ్య‌క్తి గురించి వెల్ల‌డైన షాకింగ్ వివ‌రాలు

Posted: 07/12/2022 01:41 PM IST
Intruder hafizul who barged into the house of mamata banerjee has bangladeshi links

మూడంచెల భ‌ద్ర‌త‌ను త‌ప్పించుకుని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లోకి దొంగతనంగా ప్ర‌వేశించి ప‌ట్టుబ‌డిన వ్య‌క్తి ఉదంతంపై ద‌ర్యాప్తులో షాకింగ్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ నెల 3న భ‌ద్ర‌తాధికారుల కండ్లు క‌ప్పి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి ప్ర‌వేశించిన నిందితుడిని హ‌ఫీజుల్ మొల్లాగా గుర్తించారు. అయితే ముఖ్యమంత్రి  నివాస ప్రాంగ‌ణంలో అరెస్ట‌యిన హ‌పీజుల్.. తన చేతిలో ఇనుప రాడ్‌ను కలిగివున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఇనుప రాడ్డుతో ఆయన నివాసంలోకి ప్రవేశించడానికి గల కారణాలు ఏమై ఉంటాయన్న విషయమై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలావుండగా ముఖ్యమంత్రి నివాస ప్రాంగ‌ణంలోనే ఒక రాత్రంతా గ‌డిపిన నిందితుడిని మ‌రుస‌టి రోజు ఉద‌యం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆగంతకుడిని ప‌ట్టుకుని కాళీఘాట్ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ఆగంతకుడికి బంగ్లాదేశ్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. 11 సిమ్ కార్డులు క‌లిగి ఉన్న నిందితుడు బంగ్లాదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌కు చెందిన ప‌లు నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసిన‌ట్టు గుర్తించారు. గ‌త ఏడాది స‌రైన ప‌త్రాలు లేకుండానే నిందితుడు బంగ్లాదేశ్ సంద‌ర్శించాడ‌ని వెల్ల‌డైంది. ఈ ఘ‌ట‌న అనంత‌రం సీనియ‌ర్ పోలీస్ అధికారుల పోస్టింగ్‌ల్లో కోల్‌క‌తా అధికార యంత్రాంగం ప‌లు మార్పులు చేప‌ట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles