WhatsApp warns users over malicious version of the app ఇది వాట్సాప్ కి మమ్మీ అనుకుంటే.. మీ పని డమ్మీ.!

Head of whatsapp issues warning to the indian android users

WhatsApp, WhatsApp Warning, Will Cathcart, Hey WhatsApp, new mobile phone, tech news, apple news, new samsung, new technology, technology news, latest technology, new gadgets, latest technology news, science news, techreviews, latest tech news, new smartwatch, tech news today, technews, technology articles, technology news today, latest technologies, mobile review, latest computer technology, latest technology update

WhatsApp has issued a stern warning to users, asking them to be aware of fake versions of the messaging app. The CEO of WhatsApp, Will Cathcart, is asking people on Twitter not to use the modified version of WhatsApp, as users could end up in big trouble. WhatsApp is one of the most popular instant messaging apps in the world, which makes it easy for scammers to deceive users through different techniques.

హే వాట్సాప్..! ఇది వాట్సాప్ కి మమ్మీ అనుకుంటే.. మీ పని డమ్మీ.!!

Posted: 07/12/2022 12:50 PM IST
Head of whatsapp issues warning to the indian android users

వాట్సాప్‌ ఎంతలా జనంలోకి చోచ్చుకెళ్లిందంటే.. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిపిప్షన్ కలిగిన మన సమాచారాన్ని ఎక్కడా లీక్ కాకుండా చూడటంతో ప్రపంచవ్యాప్తంగా బడా బిజినెన్స్ మ్యాన్ల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరూ వీటిని వినియోగిస్తారు. అందరిలోనూ ఇది ఎంతగానో ప్రాచూర్యాన్ని కూడా పోందింది. ఇది ఇంతలా స్మార్ట్ ఫోన్ వినియోగదారులను పెనవేసు కోవడంతో.. అచ్చంగా అలాగే ఉండే పలు యాప్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ కాదు.. దానికి మమ్మీలా బురిడీ కొట్టించి.. వాటిని ఇన్ స్టాల్ చేసుకున్నవారిని డమ్మీగా మార్చేస్తుంటాయి. ఇదివరకే అనేకం ఇలాంటివి వచ్చి కస్టమర్లను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాయి.

అయితే వీటి బారిన పడిన కొందరు తమ అమూల్యమైన వ్యక్తిగత సమాచారాన్ని కొల్పోగా, మరికోందరు తమ డబ్బులు, రహస్య సమాచారాలను కూడా కోల్పోయారు. దీంతో తమ కస్టమర్లను వాట్సాప్ యాజమాన్యం అప్రమత్తం చేసింది. అయినా అధికంగా ఆకర్షించే దానిని తమ షోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని కొందరు మోసపోతున్నారు. ఇక తాజాగా మరోక వాట్సాప్ లాగే ఉండే యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. అందులో లేని ఫీచర్లు ఇందులో దొరుకుతాయి! - ఇలాంటి మాటలు, మెసేజ్‌లు మీరు వినే ఉంటారు.. చూసే ఉంటారు కూడా. అయితే వీటిని ఎంత మాత్రం విశ్వసించొద్దని టెక్‌ నిపుణులు చెబుతున్నా నకిలీ వాట్సాప్‌లు వాడి ఇబ్బంది పడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు.

తాజాగా మరో నకిలీ వాట్సాప్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వాట్సాప్‌ సీఈవో తమ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలు చేశారు. గత కొన్ని రోజులుగా టెక్‌ సర్కిల్స్‌లో, ఆన్‌లైన్‌లో ఓ యాప్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే ‘హే వాట్సాప్‌’. ఈ యాప్‌ను ‘హే మోడ్స్‌’ అనే డెవలపర్‌ రూపొందించారు. వాట్సాప్‌ సీఈవో విల్‌ కాథ్‌కార్ట్‌ దీనిపైనే వినియోగదారులకు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. ‘‘వాట్సాప్‌ పేరుతో వస్తున్న ఎలాంటి నకిలీ యాప్‌లను వాడొద్దు. ఒకవేళ వాడితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు’’ అంటూ విల్‌ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles