Shinzo Abe hospitalized after shooting in Japan జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగుడి కాల్పులు..

Shinzo abe former japan pm shot during campaign speech

Shinzo Abe shot dead in Japan, shinzo abe news, former Japan PM, Shinzo Abe, shot, nara, Japan’s ex-PM Shize PM, Osaka, election campaign, japan, Crime

Former Japan PM, Shinzo Abe was shot at about 11:30 a.m. local time in Nara, east of Osaka, as he gave an election campaign speech on the street. He suffered a gunshot wound to the right side of his neck, according to officials in Tokyo. He was taken to the hospital first by ambulance, then by medical helicopter.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగుడి కాల్పులు.. పరిస్థితి విషమం..

Posted: 07/08/2022 01:28 PM IST
Shinzo abe former japan pm shot during campaign speech

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్‌ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అబే ప్రసంగిస్తుండగా ఆయనపై అగంతకుడు కాల్పులు జరిపాడు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దుండగుడు తుపాకీతో అబేపై రెండురౌండ్లు కాల్పులు జరిపారని, ఆయనకు తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తన కథనంలో తెలిపింది.

ఆయన పార్టీకి చెందిన ప్రముఖులు చికిత్స నిమిత్తం అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర రక్తస్రావం జరగడం వల్లే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని సమాచారం. ఇక అబే ఆరోగ్య పరిస్థితికి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని తెలిసింది. మరోవైపు అబేకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా, 2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles