AirAsia India launches Splash Sale with fares starting at ₹1,497 విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌! ఎయిర్ ఏషియా ప్లాష్ సేల్.!

Airasia india announces splash sale fares start at rs 1 497 on domestic flight routes

AirAsia India, AirAsia India Splash Sale, Aviation, AirAsia India, Splash sale, domestic flights airfare, flights, planes, airlines, AirAsia domestic flights, airfare, air tickets, price, monsoon sale, ticket bookings, air passengers,Aviation, AirAsia India, Splash sale, domestic flights airfare

AirAsia India has announced Splash Sale with fares starting from ₹1,497 on domestic routes like Delhi-Jaipur. As per the AirAsia website, the Splash Sale is valid only for bookings made between 7-10 July, 2022 for customers travelling from 26 July 2022 till 31 March 2023.

విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌! ఎయిర్ ఏషియా ప్లాష్ సేల్.!

Posted: 07/08/2022 03:49 PM IST
Airasia india announces splash sale fares start at rs 1 497 on domestic flight routes

బెంగళూరు ప్రధాన కేంద్రంగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా (ఇండియా) కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఏసియా బంపరాఫర్‌ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్‌ ఏసియా నెట్‌ వర్క్‌ ఉన్న ప్రాంతాల ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొంద వచ్చని తెలిపింది. ఆఫర్‌తో పాటు అదనంగా డిస్కౌంట్‌లు పొందవచ్చని పేర్కొంది.   

ఎయిర్‌ ఏసియా జూలై 7 నుంచి జులై 10వరకు స్ప్లాష్‌ సేల్‌ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్‌ మార్గాల్లో ఫ్లైట్‌ టికెట్‌ ప్రారంభ ధర రూ.1497గా ఉంటుందని, ఈ సేల్‌లో బుక్‌ అయిన టికెట్స్‌ను జూలై 26, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. పరిమిత ఇన్వెంటరీ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు మొత్తం బుకింగ్‌ అయితే .. జులై 10 తరువాత బుకింగ్‌కు రెగ్యులర్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్‌ పేర్కొంది.  కాగా, ఎయిర్ ఏషియా ఇండియా తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్స్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. జూన్12, 2014 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించిన ఎయిర్‌ ఏసియా... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కి పైగా 100 కనెక్టింగ్ రూట్లలో ఎయిర్‌ ఏసియా విమానాల రాకపోకల్ని నిర్వహిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles