SpiceJet Delhi-Dubai flight lands in Karachi following snag దుబాయ్ వెళ్లాల్సిన భారత విమానం.. పాకిస్థాన్ లో ల్యాండింగ్..!

Spicejet flight makes landing at karachi airport after indicator light malfunction

SpiceJet flight, SpiceJet flight news, SpiceJet flight Karachi landing, Dubai SpiceJet flight emergency landing, Spicejet Flight news, IndiGo, Karachi, Delhi news, Delhi-Dubai bound Flignt, Emergency landing, Karachi Airport, Pakistan, Passengers safe, SpiceJet B737 flight, SpiceJet flight latest news

A SpiceJet flight on made a "normal landing" at Jinnah International Airport in Pakistan's Karachi after an indicator light had malfunctioned. The Delhi to Dubai bound aircraft landed safely at Karachi airport and no emergency was declared, SpiceJet said. "On July 5, 2022, SpiceJet B737 aircraft operating flight SG-11 (Delhi - Dubai) was diverted to Karachi due to an indicator light malfunctioning.

దుబాయ్ వెళ్లాల్సిన భారత విమానం.. పాకిస్థాన్ లో ల్యాండింగ్..!

Posted: 07/05/2022 12:41 PM IST
Spicejet flight makes landing at karachi airport after indicator light malfunction

దేశ రాజధాని ఢిల్లీ నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ లోని క‌రాచీ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేశారు. కరాచీ ఎయిర్ పోర్టులో దిగినప్పటికీ అక్కడ విమాన ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్ జెట్ విమానం యాజమాన్యం తెలిపింది. అయితే పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన అవసరం ఏముందన్న దానిపై ఆ విమాన సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయలుదేరాల్సిన విమానంలో ఇంధన ఇండికేట‌ర్ లైట్‌లో స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో స్పైస్ జెట్ విమానం జీ 737 విమానాన్ని క‌రాచీకి దారి మ‌ళ్లించామని తెలిపారు.

కరాచిలో విమనాం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. విమానంలోని ప్యాసింజర్లు అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదు. విమానం సాధారణంగానే ల్యాండింగ్ అయ్యింది. ఇంతవరకు ఈ విమానానికి ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ అనుకోకుండా ఇవాళ ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమాన ప్రయాణికులందరికీ రిఫ్రెష్ మెంట్స్ అందించామని, ప్ర‌యాణికులు అంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు స్పైస్‌జెట్ ప్ర‌తినిధి తెలిపారు. మరో విమానాన్ని కరాచీకి పంపించామని.. అది అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకుని దుబాయ్ కి వెళ్తోందని ఆయన చెప్పారు.

కాగా, స్పైస్ జెట్ 737జీ విమానం ట్యాంకు నుంచి అసాధారణ రీతిలో ఇంధనం తగ్గుతోందని, దీంతో ఇండికేటర్ లోపమా.? లేక ఇంధనం లీక్ అవుతోందా.? అన్న అనుమానాలు తలెత్తి.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రెక్క‌ల భాగంలో ఉన్న ఇంధ‌న ట్యాంక్ నుంచి లీకేజీ జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. అనూహ్య రీతిలో ఫ్యూయ‌ల్ ట్యాంక్ ఖాళీ అవుతున్న‌ట్లు గుర్తించామ‌ని డీజీసీఏ అధికారులు తెలిపారు. చాలా వేగంగా ఇంధ‌నం త‌గ్గిన సంకేతాలు కాక్‌పిట్‌లో ఉన్న ఫ్యూయ‌ల్ డిస్‌ప్లేలో కనిపించిన‌ట్లు వెల్ల‌డించారు. దీని వ‌ల్లే విమానాన్ని క‌రాచీలో ముందు జాగ్ర‌త్త‌గా ల్యాండ్ చేసిన‌ట్లు తెలిపారు. విమానంలో 150 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles