మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కార్ తమపై వస్తున్న అరోపణలను సమర్థించుకుంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ.. అసెంబ్లీలో విపక్ష సభ్యులు ‘ఈడీ.. ఈడీ..’ అంటూ నినాదాలు చేయడంపై.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీటుగా స్పందించారు. “ప్రతిపక్షాలు మాది ఈడీ ప్రభుత్వం అని నినాదాలు చేస్తున్నాయి. అవును.. మాది ఈడీ గవర్నమెంటే. ఈడీ అంటే ఏక్ నాథ్, దేవేంద్ర ఫడ్నవీస్..” అని ఆయన కొత్త అర్థం చెప్పడంతో పాటు తమది ఈడీ ప్రభుత్వమని సమర్థించుకున్నారు.
ఏక్ నాథ్ షిండే కూటమితో కలిసి తాము మరోసారి శివసేన–బీజేపీ సర్కారును ఏర్పాటు చేశామని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకే తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నానని చెప్పారు. పార్టీ తనను ఇంట్లో కూర్చొమ్మంటే కూర్చునే వాడినని అన్నారు. ఈ ప్రభుత్వంలో అధికారం కోసం గొడవలు ఏమీ ఉండబోవని, తాము పూర్తిగా సహకరిస్తామని ఫడ్నవీస్ తెలిపారు. కాగా, శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ కూడా చివరి నిమిషంలో గోడ దూకారు. ఇవాళ్టి ఉదయం వరకు థాక్రే వర్గంలో ఉన్న ఆయన బలపరీక్షకు మాత్రం షిండే వర్గంతో పాటు అసెంబ్లీకి వచ్చారు.
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకు షాకిచ్చింది. ఇప్పటికే షిండే, ఫడ్నావిస్ లు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా న మహా స్పీకర్.. ఏక్నాథ్ శిందే ప్రభుత్వ బలపరీక్షకు ముందు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చారు మహా అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్. ప్రస్తుతం శివసేన శాసనసభా పక్షనేతగా ఉన్న అజయ్ చౌదరిని తొలగించి, శిందేను తిరిగి స్పీకర్ నియమించారు. శివసేన చీఫ్ విప్‌గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించారు. అయితే, ఈ నిర్ణయంపై ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసం తెలిపింది.
మహారాష్ట్రలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మరో ఆరునెలల్లో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. షిండేకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరూ సంతోషంగా లేరు. మంత్రివర్గ విస్తరణ సమయంలో మనస్పర్థలు వస్తాయి. అప్పుడు కచ్చితంగా షిండే ప్రభుత్వం పతనం అవుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ మా దగ్గరికే వస్తారు" అని పవార్ తెలిపారు. కేవలం ఆరు నెలలే సమయం ఉందని, ఎన్సీపీ శాసనసభ్యులు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more