No Hindu idols in Taj Mahal basement: ASI ‘‘అక్కడ నేల మాళిగలు, దేవతా విగ్రహాలు ఏమీ లేవు’’

No hindu idols in taj mahal basement archaeological survey of india in response to rti plea

22 locked rooms agra, hindu idols locked in taj mahal, taj mahal controversy, hindu idols in taj mahal basement, taj mahal agra, taj mahal built on temple land, taj mahal hindu idols present, what is the taj mahal controversy, taj mahal latest news, Taj Mahal, Tejo Mahal, Agra, RTI, HIndu Idols, 22 Secret rooms, Saket Gokhale, Archaeological Survey of India, Uttar Pradesh, Politics

After a long-drawn controversy over the alleged presence of Hindu deity idols in the locked basement rooms of the Taj Mahal, the Archaeological Survey of India (ASI) has finally settled the debate with a single-line answer to an RTI query. A legal notice was sent to the Centre and the ASI by a group of petitioners seeking the relocation of idols of Hindu deities, which they claim are buried under the staircase of an Agra mosque.

‘‘తూచ్.. అక్కడ నేల మాళిగలు, దేవతా విగ్రహాలు ఏమీ లేవు’’

Posted: 07/04/2022 04:50 PM IST
No hindu idols in taj mahal basement archaeological survey of india in response to rti plea

తాజ్ మహల్‌లో దేవతా విగ్రహాలు ఉన్నాయన్న ప్రచారాన్ని భారత పురావస్తు శాఖ (ASI) కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, తాజ్‌మహల్‌లో ఎక్కడా దేవతా విగ్రహాలు లేవని స్పష్టం చేసింది. తాజ్‌మహల్ నేలమాళిగలో ఉన్న గదుల్లో దేవతా విగ్రహాలు ఉన్నాయన్న ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. దీంతో మూసివున్న ఆ 22 గదులను తెరవాలంటూ అయోధ్య బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ డాక్టర్ రజనీష్ కుమార్ ఈ ఏడాది మే 7న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ గదులను తెరిచేలా పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత టీఎంసీ నేత సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం ద్వారా గత నెల 21న కొన్ని ప్రశ్నలు సంధిస్తూ పురావస్తు శాఖ నుంచి జవాబులు కోరారు. తాజ్‌మహల్ నిర్మించిన భూమి ఏదైనా ఆలయానికి చెందినదా? తాజ్‌మహల్ నేలమాళిగలో మూసివున్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా? అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. పురావస్తు శాఖ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తాజ్‌మహల్ నేలమాళిగలో అసలు మూసివున్న గదులే లేవని, తాజ్‌మహల్ నిర్మించిన ప్రదేశం ఏ ఆలయానికి చెందినది కాదని తేల్చి చెప్పింది.

ఈ మేరకు కేంద్ర ప్రజా సంబంధాల అధికారి మహేశ్ చంద్ర మీనా ఆన్‌లైన్‌లో సమాధానమిచ్చారు. గోఖలే అడిగిన తొలి ప్రశ్నకు ‘నో’ అని సమాధానమిచ్చిన ఆయన రెండో ప్రశ్నకు.. సెల్లార్‌లో ఎలాంటి దేవతా విగ్రహాలు లేవని పేర్కొన్నారు. ఏఎస్ఐ సమాధానంపై ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ చాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఏఎస్ఐ సమాధానంతో ఇకపై తాజ్‌మహల్‌కు సంబంధించి మతపరమైన ఎలాంటి కొత్త వివాదాలు రేకెత్తవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాల వల్ల పర్యాటకం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles