Maharashtra: CM Eknath Shinde Wins Trust Vote In Assembly బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్.! బలపరీక్షకు ముందు థాక్రేకు షాక్.!!

Maharashtra assembly session cm eknath shinde wins floor test with 164 votes

Eknath Shinde, Devendra Fadnavis, Sharad Pawar, Shiv Sena, Uddhav Thackeray, Vidhan Parishad, IT Notices, Love letter from IT Dept, Maharashtra Political Crisis, Maharashtra Government Formation, Maharashtra Election, Maharashtra MLA, Maharashtra MLC Election 2022, Maharashtra Vidhan Parishad, MLC Election, Sanjay Raut, Vidhan Parishad Election, Vidhan Parishad Election Maharashtra, Vidhan Parishad Election Maharashtra 2022, Ajit Pawar, BJP, Maharashtra Politics

Maharashtra Chief Minister Eknath Shinde won the floor test in the State Assembly. In the 288-member House, 164 MLAs voted for the motion of confidence, while 99 voted against it. The trust vote was held in the Assembly in the last day of the special two-day session of the House.Speaker Rahul Narvekar announced that the trust vote has been carried by a majority vote.

మహారాష్ట్ర: బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్.! బలపరీక్షకు ముందు థాక్రేకు షాక్.!!

Posted: 07/04/2022 12:39 PM IST
Maharashtra assembly session cm eknath shinde wins floor test with 164 votes

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు ప్రభుత్వ సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని అందరూ భావిస్తుండగా, షిండే అసెంబ్లీలో బలనిరూపణపై కూడా సందేహాలు నెలకొన్నాయి. కాగా ఇవాళ ఆ ఘట్టం కూడా నిర్విఘ్నంగా కొనసాగింది. అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఏక్ న్నాథ్ సిండే ప్రభుత్వం సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.

సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను మొదలుపెట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. సీఎం శిందేకు అనుకూలంగా 164 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య జూన్​30న ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎంగా బిజేపి నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. కూడా షిండే వర్గంలో చేరారు. సోమవారం ఉదయం ఆయన షిండే వర్గ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు.

మహారాష్ట్రలో మొత్తం సీట్లు 288 కావడంతో మ్యాజిక్ ఫిగర్ 145గా ఉండగా, ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 144గా నిర్ణయించబడింది. ఇక ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో మద్దతును కూడగట్టుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఏక్​నాథ్ షిండే బలపరీక్షలో గెలుపొందారు. ఈ మేరకు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఈ పరిణామంతో మహారాష్ట్రలో మరో రెండున్నరేళ్ల పాటు షిండే ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో తమ సమస్యలకు పరిష్కారం లభించనుందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles