“Apologise To Country”: Supreme Court To Nupur Sharma దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పు: నుపూర్ శర్మపై సుప్రీంకోర్టు

Kakinada ysrcp mlc anantha babu remand extended

Nupur Sharma, Nupur Sharma Supreme Court, SC slams Nupur Sharma, Nupur Sharma Udaipur Killing, Remarks against Prophet, Nupur Sharma Prophet comment, Nupur Sharma BJP, SC remarks on Nupur Sharma, What SC said on Nupur Sharma, former BJP Spokesperson, Supreme Court, Remarks against Prophet, Udaipur Killing, Rajasthan, National news, Crime

The Supreme Court today came down heavily on suspended BJP leader Nupur Sharma for igniting tension with her comments on Prophet Muhammad and said she should “apologise to the whole country”. “The way she has ignited emotions across the country. This lady is single-handedly responsible for what is happening in the country,” said the judges.

నుపూర్ శర్మపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని అదేశం..

Posted: 07/01/2022 09:09 PM IST
Kakinada ysrcp mlc anantha babu remand extended

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్​ శర్మపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గల్ఫ్​ దేశాలతో పాటు భారత్​వ్యాప్తంగా నిరసనలకు కారణమైన నుపుర్​ శర్మ.. దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఆందోళనలకు పూర్తి బాధ్యత నుపుర్​ శర్మదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహమ్మద్​ ప్రవక్తపై నుపుర్​ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. సర్వత్రా నిరసనలకు దారితీశాయి. ఆ తర్వాత ఆమెపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి.

కాగా.. వాటన్నింటిని కలిపి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు నుపుర్​ శర్మ. తాజాగా.. వాటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. నుపుర్​ శర్మ పిటిషన్​ను తోసిపుచ్చింది. "ఆ డిబెట్​ని(మహమ్మద్​ ప్రవక్తపై నుపుర్​ శర్మ చేసిన వ్యాఖ్యలు) మేము చూశాము. ఆమె ఆ మాటలు చెప్పిన తీరు చాలా ఆందోళనకరంగా ఉంది. పైగా.. తనని తాను న్యాయవాదిగా ఆమె చెప్పుకుంటోంది. ఇది సిగ్గుచేటు. దేశం మొత్తానికి నుపుర్​ శర్మ క్షమాపణలు చెప్పాలి. మీరు(నుపుర్​ శర్మ) ఇతరులపై ఎఫ్​ఐఆర్​లు వేస్తే.. వారిని వెంటనే అరెస్ట్​ చేస్తారు. కానీ మిమ్మల్ని అరెస్ట్​ చేసేందుకు మాత్రం ఎవరికి ధైర్యం లేదు," అని అత్యున్నత న్యాయస్థానం జస్టిస్​ సూర్య కాంత్​ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో నుపుర్​ శర్మ ప్రవర్తనపైనా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. "రాజకీయ పార్టీకి ప్రతినిధిగా ఉంటే ఏంటి? అధికారం తన వెనక ఉందని, దేశంలోని చట్టాలను గౌరవించకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని ఆమె అనుకుంటోందా?" అని జస్టిస్​ సూర్యకాంత్​ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలతో దేశంలోని ఓ వర్గం ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమె గ్రహించలేకపోయిందా.? లేక కావాలనే ఇలా వ్యాఖ్యలు చేసి.. దేశంలో అగ్గిరాజేసేందుకు యత్నించిందా.? అని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై స్పందించిన నుపుర్​ శర్మ తరఫు న్యాయవాది.. టీవీ డిబెట్​లో అడిగిన ప్రశ్నకు మాత్రమే ఆమె సమాధనం ఇచ్చిందని అన్నారు. ఫలితంగా సంబంధిత డిబేట్​పైనా సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. టీవీ డిబేట్​ నిర్వహించిన హోస్ట్​పైనా కేసులు వేయాల్సింది అని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రజలకు మాట్లాడే హక్కు లేదని నుపుర్​ శర్మ తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం మరింత ఆగ్రహాన్ని బయటపెట్టింది. "ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గడ్డికి పెరిగే హక్కు ఉంటుంది. గాడిదకు తిండి తినే హక్కు కూడా ఉంటుంది," అని జస్టిస్​ సూర్య కాంత్​ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles