KCR Receives Yashwant Sinha At Airport రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాదులో ఘనస్వాగతం..

Kcr receives opposition s presidential candidate yashwant sinha at hyderabad airport

KCR, Yashwant Sinha, Telangana Chief Minister, KCR receives Yashwant sinha, Presidential election, Yashwant Sinha in hyderabad, Opposition's Presidential Candidate Yashwant Sinha, special plane, Indian Air Force, Begumpet Airport, Presidential polls, BJP national executive meet, Hyderabad, Telangana, Politics

Telangana Chief Minister K Chandrashekar Rao on Saturday received Opposition's presidential candidate Yashwant Sinha at Begumpet Airport in Hyderabad. KCR has announced his support to Mr Sinha in the upcoming presidential polls slated to be held on July 18.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాదులో ఘనస్వాగతం..

Posted: 07/02/2022 11:39 AM IST
Kcr receives opposition s presidential candidate yashwant sinha at hyderabad airport

దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. యశ్వంత్ సిన్హా రాక కోసం అప్పటికే విమానాశ్రయం చేరుకుని ఎదురుచూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారమే  విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ సాగింది.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వరకు భారీ బైక్ ర్యాలీ మధ్య యశ్వంత్ సిన్హా. కేసీఆర్ కాన్వాయ్ తరలివెళ్లింది. కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఒకే వాహనంలో బయల్దేరారు. రోడ్డు పక్క ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వీరు జలవిహార్ కు వెళ్తున్నారు. వీరి కాన్వాయ్ కు ముందు వేలాది ద్విచక్ర వాహనాలతో బైక్ ర్యాలీ కొనసాగగా.. వాటిని కేసీఆర్ కాన్వాయ్ అనుసరిస్తోంది. రోడ్డు మొత్తం టీఆర్ఎస్ జెండాలతో గులాబీమయంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్రపతి అభ్యర్థి సిన్హా ప్రసంగించనున్నారు. జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles