గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే బీజేపీ ముఖ్యమంత్రి పగ్గాలను చేపడుతుందని.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తారని వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ.. ట్విస్ట్ ఇచ్చింది బీజేపి. సీఎంగా శివసేన రెబల్ ఎమ్మెల్యేల గ్రూపు నాయకుడు ఏక్ నాథ్ షిండేను ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేత దేవేంద్ర ఫడ్నావిస్ సంచలన ప్రకటన చేశారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో శిబిరం నిర్వహించిన షిండే గురువారం మధ్యాహ్నం గోవా నుంచి ముంబై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లిన షిండే.. ఆయనతో కలిసి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిశారు. ప్రస్తుత సమీకరణాల పరంగా ప్రభుత్వ ఏర్పాటు తమకే సాధ్యమని, సంఖ్యాపరంగా ఎక్కువమంది ఎమ్మెల్యేల బలం తమకే ఉందని ఈ సందర్భంగా ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. రేపటి ప్రమాణస్వీకారం సందర్భంగా కొద్దిమంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దేవేంద్ర ఫడ్నావిస్ సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫడ్నవీస్ సంచలన ప్రకటనలు చేశారు. షిండే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం కొలువుదీరనుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తాము షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరబోమని ప్రకటించారు. అంతేకాకుండా షిండే ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని కూడా ఫడ్నవీస్ మరో కీలక ప్రకటన చేశారు. వెరసి మహారాష్ట్ర తదుపరి సీఎం ఫడ్నవీస్ అన్న అందరి అంచనాలను ఆయన తలకిందులు చేసేశారు. ఫడ్నవీస్ ప్రకటనకు ముందే... షిండేను శివసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లుగా ఓ ప్రకటన వెలువడింది.
మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్‌నాథ్ షిండే అని ప్రకటించారు. ఆయన ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఏక్‌నాథ్ షిండే ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతోపాటు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటారని వెల్లడించారు. మరోవైపు వారం పాటు గౌహతిలో ఉండి బుధవారం అక్కడి నుంచి గోవాలోని హోటల్‌కు మకాం మార్చిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేను సీఎంగా ప్రకటించడంతో సంతోషంతో డ్యాన్సులు వేశారు. షిండే సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు కానుడటంతో ఆనందం పట్టలేకపోతున్నారు.
#WATCH | Eknath Shinde-faction MLAs, staying at a hotel in Goa, celebrate following his name being announced as the Chief Minister of Maharashtra. pic.twitter.com/uJVNa4N74g
— ANI (@ANI) June 30, 2022
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more