బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై ధగధగ మెరుస్తుందనడంలో సందేహమే లేదు. అయితే నల్లని ఛాయతో ఉన్నవారి అందిరికీ బంగారం అంటే ఇష్టమని చెప్పనూ లేము. కానీ ఇక్కడ మాత్రం అది తాము తినే వస్తువు అనుకుంటున్నాయో.. లేక వాటికి నిజంగా సువర్ణం అంటే ఇష్టమో తెలియదు కానీ ఓ పెద్ద ముఠా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తోంది. తమ శక్తికి ఇది మించిన భారమని తెలిసినా.. ముఠా సభ్యులందరూ కలసి ఈజీగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు.
ఔనా, నిజమేనా అంటే.. ముమ్మాటికీ నిజమే. కానీ ఈ నల్లని వర్ణ జీవుల ముఠా అంతా కలగలసి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నా.. వాటిని మాత్రం ఎవరూ శిక్షించలేక పోతున్నారు. ఎందుకుంటారా.? వాటిని ఏ శిక్షాస్మృతి కింద శిక్షించాలో కూడా తెలియపోవడమే కారణం. ఈ ముఠా అంతా కలసి పట్టపగలు బంగారాన్ని తస్కరిస్తుంటే.. వాటిని అరెస్టు చేసేందుకు పోలీసులు ముందుకురారేం అంటరా.? ఎందుకంటే అవి చీమలు. అవి సైజులో చిన్నవి కాబట్టి అవి మోసుకెళ్లే వస్తువులు కూడా చిన్నవిగా ఉంటాయని అనుకుంటే పోరబాటే. అయితే ఈ వీడియోలో ఏకంగా వాటి సైజుకు మించి, బంగారపు గొలుసుని దొంగలిస్తున్నాయి. అందుకే చీమలను కూడా చీప్‌గా చూడకూడదంటారు.
ఇంతకీ వీటికి బంగారంతో ఏం పని అంటారా.? చీమలు బంగారపు గొలుసు ఎత్తుకెళ్లడమేంటి.?, వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారు చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘‘చిన్ని గోల్డ్ స్మగ్లర్లు.. వీళ్లను ఏ ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయాలి?’’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘‘ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవి బంగారం గొలుసును ఎందుకు తీసుకెళ్తున్నట్లు?’’ అని కామెంట్ చేశారు. చాలా వరకు ఆ చీమల గుంపు బంగారం గొలుసుని ఎత్తుకెళ్లడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tiny gold smugglers
— Susanta Nanda IFS (@susantananda3) June 28, 2022
The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more