Tailor beheaded in Udaipur over post support to Nupur Sharma ఉదయ్ పూర్ ఉద్రిక్తం: టైలర్ దారుణహత్య..

Man beheaded in udaipur for blasphemy killers entered his tailoring shop posing as customers

udaipur, udaipur murder, udaipur hindu shopkeeper killed, udaipur news, udaipur murder news, ashok gehlot, udaipur tailor, udaipur tailor video, udaipur tailors killed, udaipur taylor killing, udaipur tailor death, Udaipur, Tailor, HIndu, Islamic Radical Group, facebook post, Nupur sharma, Narendra Modi, Ashok Gehlot, Rajasthan, Crime

A shopkeeper was murdered in broad daylight in Udaipur, sparking tensions in the city. The shopkeeper, named Kanhaiya Lal, was murdered by two men who chopped his head off and later recorded a video admitting to killing the man over a social media post in support of Nupur Sharma. The police arrested the two accused in Bheem area of Rajsamand district. The accused were caught while they were trying to flee.

ఉదయ్ పూర్ ఉద్రిక్తం: టైలర్ దారుణహత్య.. తలను వేరు చేసిన దుండగులు

Posted: 06/28/2022 08:50 PM IST
Man beheaded in udaipur for blasphemy killers entered his tailoring shop posing as customers

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్‌ అనే టైలర్‌ ను ఇద్దరు అగంతకులు దారుణంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అలముకున్నాయి. తన దుకాణంలో పనిచేసుకుంటున్న టైలర్ తన పనిలో నిమగ్నమై ఉండగా.. లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆయనను అత్యంత దారుణంగా హత్యచేశారు. టైలర్ మొండం నుంచి తలను వెరు చేశారు. మంగళవారం అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు.

ఉదయ్ పూర్ లోని ధన్‌మండీ ఏరియాలోని ఒక దుకాణంలో చోటుచేసుకున్నది. హత్యకు సంబంధించిన వీడియోను నిందితులు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ఉద్రిక్తతలు రాజేసింది. టైలర్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో చేసిన వివాదాస్పద మతపరమైన పోస్టు ఈ హత్యకు కారణమని ఈ దుండగులు సోషల్ మీడియాలో సెల్పీ పోస్టు పెట్టారు. వీరు ఇస్తామిక్ రాడికల్ గ్రూపుకు చెందినవారిగా వారు చెప్పుకున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్‌ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్‌ హత్యోదంతంతో స్థానికంగా ఉద్రిక్తలు చెలరేగాయి. దుకాణాలను మూసివేసి.. వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు.

హత్య నేపథ్యంలో నగరంలో భారీగాబలగాలు మోహరించారు. కర్ఫ్యూ విధించారు. ప్రజలు గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు. 24 గంటల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. ప్రజలు సంయమనం వహించాలని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ విజ్ఞప్తి చేశారు. హత్య వీడియోలను షేర్‌ చేయొద్దని కోరారు. టైలర్‌ హత్య అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్‌ శర్మకు మద్దతుగా టైలర్‌ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Udaipur  Tailor  HIndu  Islamic Radical Group  facebook post  Nupur sharma  Narendra Modi  Ashok Gehlot  Rajasthan  Crime  

Other Articles