అంతా విధి లిఖితం.. ఎవరికి ఎప్పుడు ఏమి జరగాలో.. వారికి అప్పుడు అది జరిగి తీరుతుంది. చెన్నై బ్యాంకు మేనేజర్ వాణి కారు ప్రయాణం చేస్తుండగా, కారుపై చెట్టు పడిన ఘటనలో ఈ విషయాన్ని పేర్కోన్నాం. అదే మరో ఘటనలోనూ మరోమారు నిరూపితమైంది. అచ్చంగా అలాంటి ఘటనే మరోకరి జరిగింది. అయితే ఇక్కడ బాధితురాలు స్కూటర్‌పై వెనుక కూర్చొని స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. ఇక దీనికి తోడు ఇక్కడ చెట్టుకు బదులు చెట్టుపై నుంచి పెద్ద కోబ్బరిబోండాం సరిగ్గా మహిళ తలపై పడింది. దీంతో ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. ఇంతటి పెద్ద ఘటన జరిగినా సదరు మహిళకు మాత్రం పెద్దగా ప్రాణాపాయం జరగలేదు. ఎందుకంటే బాధిత మహిళ హెల్మెట్ ధరించింది.
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారని కాదు.. ఈ ఘటన కూడా రుజువుచేస్తోంది. ఊహించని ఈ సంఘటన మలేషియాలో జరిగింది. స్నేహితులైన ఇద్దరు మహిళలు ఆదివారం జలాన్ తెలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్‌కు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే రోడ్డు పక్కగా ఉన్న కొబ్బరి చెట్లు రోడ్డు మీదకు ఒంగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక కొబ్బరి చెట్టు పై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళపై తలపై నేరుగా పడింది. దీంతో అదుపు తప్పిన ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. ఆమె ధరించిన హెల్మెట్ కూడా కింద పడిపోయింది. స్కూటర్‌ను ఆపిన స్నేహితురాలు వెంటనే సహాయం కోసం ఆమె వద్దకు పరుగున వచ్చింది.
మరోవైపు రోడ్డుపై వెళ్తున్నవారు, స్థానికులు వెంటనే స్పందించారు. ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలను అప్రమత్తం చేసి ఆపారు. గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ తమన్ ఎమాస్‌కు చెందిన పువాన్ అనిత అని స్థానిక రాజకీయ నేత అజ్రుల్ మహతీర్ అజీజ్ తెలిపారు. ఈ ప్రమాదం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. రోడ్డు మీదకు ఒంగి ప్రమాదాలకు దారి తీసేలా ఉన్న కొబ్బరి చెట్లను నరికివేస్తామని అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. కాగా, ఆ స్కూటర్ వెనుక వెళ్తున్న కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది.
https://www.reddit.com/r/nevertellmetheodds/comments/vl68jd/a_coconut_fell_straight_on_a_bikers_head/?utm_source=share&utm_medium=web2x&context=3
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more